
మామూలుగా రాజమౌళి సినిమాలకు కమిటయ్యాక హీరోలు బయటికి రారు.. నిజం చెప్పాలంటే జక్కన్నే రానియ్యరు. మరి మహేష్ బాబుకు మాత్రమే ఎందుకంత ఫ్రీడమ్ ఇచ్చారు..? చరణ్, ప్రభాస్, తారక్ లాంటి హీరోలను కూడా వదలని జక్కన్న.. సూపర్ స్టార్‌ను ఎందుకొదిలేసారు..? SSMB29 విషయంలో కొత్త స్ట్రాటజీ అప్లై చేస్తున్నారా..? ఇదే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ..

ఈ సినిమాలో ఇంతవరకు ట్రై చేయని డిఫరెంట్ లుక్ ట్రై చేస్తున్నారు మహేష్. ఈ సారి నేషనల్ లెవల్‌లో కాదు గ్లోబల్ లెవల్‌లో కాస్టింగ్ సెట్ చేస్తున్నారు జక్కన్న.

రాజమౌళి సినిమా అంటేనే హీరోలకు మేకోవర్ కంపల్సరీ. ప్రతీ సినిమాలోనూ అది చేస్తుంటారు జక్కన్న. మహేష్ బాబు సైతం ఇదే చేస్తున్నారిప్పుడు. గుంటూరు కారంలో ఫుల్ మాస్ అవతార్‌లో కనిపించిన మహేష్.. SSMB 29 కోసం సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే ఒక్కోసారి ఒక్కో లుక్‌లో దర్శనమిస్తున్నారు సూపర్ స్టార్.

ఇంత క్రేజ్ ఉన్న ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుంది..? అస్సలు జక్కన్న, మహేష్ ప్రజెంట్ ఏం చేస్తున్నారు.? గుంటురు కారం రిలీజ్ తరువాత షార్ట్ బ్రేక్ తీసుకున్న మహేష్, వెంటనే నెక్ట్స్ మూవీ వర్క్ షురూ చేశారు.

దాన్ని ప్లాన్ చేయడం కూడా అలాగే చేస్తున్నారు జక్కన్న. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ చివరి దశకు వచ్చేసింది. మరికొన్ని రోజుల్లోనే సెట్స్‌పైకి రానుంది. నిన్నమొన్నటి వరకు ఈ చిత్ర బడ్జెట్ 500 కోట్లన్నారు కానీ దాని స్థాయి అక్కడ లేదు.