
విక్టరీ వెంకటేష్ తెలియని వారు ఎవరు ఉండరు. ఈయన హిట్ సినిమాల్లో చంటి మూవీ ఒకటి. ఈ మూవీలో మీన హీరోయిన్‌గా నటించింది. ఇందులో వెంకటేష్ అమాయకపు వ్యక్తిగా నటించి తన నటనతో ఎంతో మంది మదిని దోచుకున్నాడు. ఇప్పటికీ ఈ సినిమా అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది.

రవిరాజ పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మీనా నందిని పాత్రలో, వెంకటేష్ చంటి అనే ఓ అమాయకపు కుర్రాడి పాత్రలో నటిస్తాడు. ఇక ఈ మూవీలో నాజర్, సుజాత, బ్రహ్మానందం, సుజాత తదీతరులు నటించారు. ఈ మూవీ రిలీజై ఊహించని విధంగా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అయితే తమిళంలో చినతంబి సినిమాకు రీమేక్ గా చంటి సినిమాను తెలుగులో తెరకెక్కించారు. ఈ మూవీ ఎవరూ ఊహించని విధంగా మంచి హిట్ అందుకుంది.

అయితే ఈ సినిమాను దర్శకుడు మొదటగా వెంకటేష్‌తో తీయాలి అనుకోలేదంట. ఈయన ఓ స్టార్ హీరోతో మూవీ చేద్దాం అనుకున్నారంట. ఇంతకీ ఆహీరో ఎవరంటే? రాజేంద్ర ప్రసాద్. ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు రవిరాజ పినిశెట్టి, చంటి మూవీ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆయన ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాం.

దర్శకుడు మాట్లాడుతూ.. చంటి సినిమా కథను ముందుగా తమిళంలో విన్న రామానాయుడు ఈ సినిమా కథలోని ఈ పాత్రకు వెంకటేష్ సరిపోరాని చెప్పారు. దీంతో కే. ఎస్ రామారావు ఈ మూవీని చూసి దీనికి రాజేంద్ర ప్రసాద్ సెట్ అవుతారని చెప్పాడంట. దీంతో నేను రాజేంద్ర ప్రసాద్‌కు కథ చెప్పాను, తాను కూడా ఒకే చెప్పారు. ఇక మూవీ ఒకే అనుకున్నాం. ఇదంతా మూవీ తమిళంలో రిలీజ్ కాకముందు జరిగింది.

అయితే తమిళంలో మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అందుకున్న తర్వాత, సురేష్ బాబుకు, వెంకటేష్‌కు ఈ సినిమా చాలా నచ్చిందంట. దీంతో కే. ఎస్ రామారావు దర్శకుడి వద్దకు వచ్చి ఈ సినిమా వెంకటేష్‌తో చేయమని చెప్పాడంట. కానీ దానికి నేను అంగీకరించలేదు, నాకు పద్ధతి అనిపించలేదు.. కానీ చిరంజీవి నన్ను ఒప్పించడంతో ఈ మూవీ వెంకటేష్‌తో చేశాను అని దర్శకుడు చెప్పుకొచ్చాడు.