1000 Crore Club: రాబోయే 1000 కోట్ల సినిమా ఏది..? మన దగ్గర ఏది ఆ క్లబ్‌లో చోటు సంపాదించబోతోంది..?

| Edited By: Prudvi Battula

Jan 28, 2024 | 2:35 PM

ఒకప్పుడు 1000 కోట్లు అంటే ఆశ్చర్యంగానే కాదు అసాధ్యంగా చూసేవాళ్ళు. కానీ ఇప్పుడది చాలా ఈజీ అయిపోయింది. మరీ ముఖ్యంగా సౌత్ సినిమాలు 1000 కోట్లు వసూలు చేయడం అలవాటుగా చేసుకున్నాయి. కానీ RRR తర్వాత ఏ సినిమాకు 1000 కోట్లు రాలేదు.. సలార్ వస్తుందనుకున్నా మిస్ అయిపోయింది. మరి రాబోయే 1000 కోట్ల సినిమా ఏది..? మన దగ్గర ఏది ఆ క్లబ్‌లో చోటు సంపాదించబోతోంది..?

1 / 5

2 / 5
బాహుబలి 2 సినిమా ఏ ముహూర్తంలో 1000 కోట్లు దాటిందో తెలియదు కానీ అప్పటి నుంచి ఇండియన్ సినిమాకు.. అది ఒక అలవాటుగా మారిపోయింది. రాజమౌళి ఈ క్లబ్‌లో రెండుసార్లు చేరిపోయారు.

3 / 5
RRR దాదాపు 1280 కోట్లు వసూలు చేసింది. దీని తర్వాత కేజిఎఫ్ చాప్టర్ 2.. 1200 కోట్లు కొల్లగొట్టి సౌత్ నుంచి మూడో సినిమాగా నిలిచింది. కేవలం సౌత్ సినిమాకు మాత్రమే సాధ్యమైన 1000 కోట్ల రికార్డును పఠాన్, జవాన్ సినిమాలతో బాలీవుడ్‌కు పరిచయం చేశారు షారుక్ ఖాన్.

4 / 5
యానిమల్, సలార్ ఈ క్లబ్‌లో చేరతాయని ఆశించినా.. కుదర్లేదు. యానిమల్ 850 కోట్ల దగ్గర ఆగిపోతే.. సలార్ 725 కోట్లతోనే సరిపెట్టుకుంది. అలాగే జైలర్, లియో కూడా 600 కోట్లకు అటూ ఇటూగా వసూలు చేసాయి.

5 / 5
ఇదిలా ఉంటే ఇండియన్ సినిమాలో నెక్స్ట్ 1000 కోట్ల ప్రాజెక్ట్ ఏదనే చర్చ మొదలైంది. దీనికి సమాధానంగా మళ్లీ సౌత్ సినిమాలే కనిపిస్తున్నాయి. పుష్ప 2తో పాటు దేవర, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, ప్రభాస్ సలార్ 2తో పాటు ప్రాజెక్ట్ K లాంటి సినిమాలు సరిగా వర్కౌట్ అయితే కచ్చితంగా 1000 కోట్లు వసూలు చేస్తాయి. మరి వీటిలో ఏది ఆ క్లబ్‌లో చోటు సంపాదించుకుంటుందో చూడాలి.