
టాప్ ఫైవ్ స్థానాల కోసం జరుగుతున్న స్వర యుద్ధం... నెక్స్ట్ గ్లోబల్ సింగింగ్ స్టార్ ఎవరు? అంటూ విడుదలైన.. ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ త్రీ లేటెస్ట్ ప్రోమో.. ఎపిసోడ్ మీద అంచనాలు పెంచేస్తోంది.

సై అంటే సై అంటున్న జడ్జెస్.. ఈ స్వర సమరంలో ఎవరిది పవర్ అంటూ ఈ వారం ప్రోమో విడుదల చేసేసింది ఆహా టీమ్. అచ్చ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ ఆహాలో 100 శాతం వినోదాన్ని అందిస్తూ పాటల పండగ చేస్తోంది ఇండియన్ ఐడల్ సీజన్ 3.

ఈ వారం ఎపిసోడ్‌లు పండగలాగా ముస్తాబయ్యాయి. మన సంస్కృతిని ప్రతిబింబించే సంప్రదాయ వేషధారణలో కంటెస్టంట్లు కూడా మెప్పించారు. ఆహా ఇండియన్ ఐడల్ సీజన్స్ లో ఇంతకు ముందెప్పుడూ జరగనంతగా రేస్ టు ఫినాలే మొదలైందని జడ్జిలు చెబుతుంటే ఆడియన్స్ కి గూస్‌బంప్స్ వచ్చేశాయి.

కార్తిక్‌ని గర్వపడేలా చేసిన కంటెస్టంట్ ఎవరు? ట్రిపుల్ ఆర్‌లో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ని గుర్తుచేసిన చేసిన కంటెస్టంట్లు ఎవరు? స్పెషల్ గెస్టుగా వచ్చిన హరీష్ శంకర్ ఏమన్నారు? మిరపకాయ కెప్టెన్‌తో వచ్చిన హీరోయిన్ ఏమన్నారు? ఇలాంటివి ఎన్నెన్నో విషయాలు తెలుసుకోవాలంటే ఈ శుక్ర, శనివారాల్లో ఎపిసోడ్‌ని మిస్ కావద్దు అని అంటోంది ఆహా...

రాగాలతో, కీర్తనలతో వినాయకచవితి వేడుక చేసుకుందాం అంటూ ఎలాంటి పాటలు ఉండబోతున్నాయో లీలగా హింట్ ఇచ్చేసింది టీమ్. అసలు సిసలైన రాగాలకు, వినసొంపైన వాయిద్యాలు తోడైతే అక్కడ సంగీతం పండగ చేసుకోకుండా ఉంటుందా?