
వేట్టయన్ సినిమాకు మార్నింగ్ షోతోనే యునానిమస్ పాజిటివ్ బజ్ క్రియేటైంది. జై భీమ్‌లాంటి మూవీ చేసిన డైరక్టర్, జైలర్ సక్సెస్ మీదున్న సూపర్‌స్టార్ రజనీతో చేసిన సినిమా ఎలా ఉంటుందోనని అప్పటిదాకా జరిగిన డిస్కషన్‌కి, రిలీజ్‌డే పాజిటివ్ టాక్ ఫుల్‌స్టాప్ పెట్టేసింది.

తన నెక్స్ట్ మూవీ సూర్యతో ఉంటుందని చెప్పేశారు జ్ఞానవేల్. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ కూడా మొదలైందని హింట్ ఇచ్చారు. జై భీమ్ కాంబోలో వచ్చే ఆ స్టోరీ మీద అప్పుడే బజ్ మొదలైంది.

ఓ వైపు వేట్టయన్ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్న రజనీకాంత్... ప్రస్తుతం కూలీ మూవీ పనుల్లో ఉన్నారు. నా కెరీర్‌లో నేను ఏ సినిమానూ ఆరు నెలలకు మించి తీయలేదు. కూలీని కూడా ఆరునెలల లోపే పూర్తి చేసేయాలనుకుంటున్నారు లోకేష్.

ఆ వెంటనే ఎల్‌సీయూలో ఉన్న హీరోలందరితో కలిసి ఓ భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నారు. అయితే కూలీ... ఎల్‌సీయూలో ఉండదు అని తన ట్రావెల్ డీటైల్స్ చెప్పేశారు ఈ బ్లక్ బస్టర్ కెప్టెన్. కూలీ పూర్తి కాగానే ఎల్‌సీయూ హీరోలతో ప్రాజెక్ట్ మొదలుపెట్టేస్తారు లోకేష్.
