Kannappa: మంచు విష్ణు కెరీర్‌కు కన్నప్ప ఎంతవరకు హెల్ప్ అవుతుంది..?

| Edited By: Prudvi Battula

Nov 24, 2023 | 10:51 AM

కెరీర్ మొదలుపెట్టి 20 ఏళ్ళు అవుతున్నా ఇప్పటికీ సరైన మార్కెట్ లేని హీరో మంచు విష్ణు. మధ్యలో కొన్ని విజయాలు ఉన్నా కూడా ఈయన సరైన రీతిలో దాన్ని యూజ్ చేసుకోలేకపోయాడు. ముఖ్యంగా ఢీ, దేనికైనా రెడీ, దూసుకెళ్తా లాంటి సినిమాలతో విష్ణుకు దాదాపు 15 కోట్ల మార్కెట్ క్రియేట్ అయింది. కానీ ఆ తర్వాత ముందు వచ్చిన సినిమాలేవీ విష్ణుకు విజయాలు తీసుకురాలేదు. దాంతో వచ్చిన విజయాలు కూడా యూజ్ కాలేదు. కొన్నేళ్లుగా ఈయన కొత్తగా సినిమాలే చేయట్లేదు.

1 / 5
ఓ విధంగా చెప్పాలంటే విష్ణు మాత్రమే కాదు.. మనోజ్, మోహన్ బాబు కూడా సినిమాలకు దూరంగానే ఉన్నారు. అప్పుడప్పుడూ కనిపించడం తప్పిస్తే.. రెగ్యులర్‌గా సినిమాలేం చేయడం లేదు. అలాంటిది ఇప్పుడు మంచు విష్ణు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేస్తున్న సినిమా కన్నప్ప. ఎప్పట్నుంచో ఈ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడు మంచు వారబ్బాయి. దానికోసమే ప్లానింగ్స్ కూడా సిద్ధం చేసుకున్నాడు.

2 / 5
అప్పట్లో తణికెళ్ల భరణి దర్శకత్వంలో కన్నప్ప సినిమా చేయాలనుకున్నారు కానీ వర్కవుట్ అవ్వలేదు. అయితే కథ మాత్రం అలాగే ఉండిపోయింది. దాన్నే ఇప్పుడు 150 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు విష్ణు. దీనికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకుడు. సీరియల్స్ తెరకెక్కించిన అనుభవం ఉన్న ఈ దర్శకుడితోనే ముందుకు వెళ్తున్నాడు విష్ణు. షూటింగ్ అంతా న్యూజిలాండ్‌లోనే జరుగుతుంది.

3 / 5
అయితే కన్నప్పను చాలా సీరియస్‌గా తీసుకున్నాడు ఈ హీరో. దానికోసం ప్రాణం పెడుతున్నాడు. మరీ ముఖ్యంగా షూటింగ్ లొకేషన్స్ నుంచి మొదలు పెడితే లుక్ వరకు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వడం లేదు. బడ్జెట్ దగ్గర కూడా నో కాంప్రమైజ్ అంటున్నాడు విష్ణు. అందుకే తన మార్కెట్ కంటే పదింతలు ఎక్కువగా ఖర్చు చేస్తున్నాడు. పైగా కన్నప్పలో మోహన్ బాబు, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, ప్రభాస్, నయనతార సహా మరికొందరు స్టార్స్ నటిస్తున్నట్లు స్వయంగా మంచు విష్ణు క్లారిటీ ఇచ్చాడు.

4 / 5
కచ్చితంగా ఇవన్నీ సినిమా మార్కెట్‌పై, బిజినెస్‌పై ప్రభావం చూపించడం ఖాయం. కెరీర్‌లో సాలిడ్ బ్లాక్‌బస్టర్ కోసం వేచి చూస్తున్న విష్ణు.. కన్నప్పతో ఆ కోరిక తీర్చుకోవాలని చూస్తున్నాడు. తాజాగా విడుదలైన పోస్టర్ ఆకట్టుకుంటుంది.

5 / 5
ఇందులో అడవుల్లో మంచు విష్ణు వేటగాడిలా గాల్లోకి ఎగురుతూ బాణాలు వేస్తున్నాడు. వెనుక కొండలు, జలపాతాలతో శివలింగం ఆకారం వచ్చేలా డిజైన్ చేశారు. చూడగానే ఆసక్తి రగిలించేలా ఉంది ఈ పోస్టర్. కన్నప్ప టైటిల్ కూడా ఆసక్తిగా డిజైన్ చేశారు. దేవుడ్ని నమ్మని ఓ వేటగాడు శివుడికి వీర భక్తుడిగా ఎలా మారాడనేది కన్నప్ప లైన్. దాంతో పోస్టర్ కూడా అలాగే డిజైన్ చేసారు. పాన్ ఇండియా సినిమాగా కన్నప్ప 2024లో థియేటర్స్‌లోకి రానుంది. మరి ఇది మంచు విష్ణు కెరీర్‌కు ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి. 