
కొత్తమ్మాయిలు రావడం కాదు.. వచ్చిన వాళ్లు సక్సెస్ అయినపుడే హీరోయిన్ల కష్టాలకు కనీసం కామా అయినా పడుతుంది. ఇప్పుడిదే జరుగుతుంది. మిస్టర్ బచ్చన్‌తో ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే.. మీడియం రేంజ్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ అయిపోయారిప్పుడు. రామ్ పోతినేని ఆంధ్రాకింగ్ తాలూక, దుల్కర్ సల్మాన్ కాంతా సినిమాల్లో నటిస్తున్నారీమే.

ప్రభాస్, హను రాఘవపూడి సినిమాతో పరిచయమవుతున్న ఇమాన్వి ఇస్మాయిల్ గురించి చర్చ బాగానే జరుగుతుంది. ఈ సినిమా విడుదలకు ముందే ఇమాన్వికి ఆఫర్స్ వస్తున్నాయి.

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమాతో రుక్మిణి వసంత్ టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. ఈ మధ్యే మదరాసిలో నటించారు రుక్మిణి. ప్రస్తుతం ఈమె బాగానే ట్రెండ్ అవుతున్నారు.

ప్రదీప్ రంగనాథన్ డ్రాగన్ తర్వాత కయాదు లోహర్ పేరు బాగానే వినిపిస్తుంది. విశ్వక్ సేన్, అనుదీప్ కాంబోలో వస్తున్న ఫంకీలో నటిస్తున్నారు. ప్రభాస్ రాజా సాబ్‌తో మాళవిక మోహనన్ పరిచయం అవుతున్నారు.

కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ కూడా రవితేజ, కిషోర్ తిరుమల సినిమాతో పాటు విశ్వంభరలో నటిస్తున్నారు. మొత్తానికి ఈ బ్యూటీస్ అంతా క్లిక్ అయితే కొన్నాళ్ల పాటు హీరోయిన్ కష్టాలు తీరిపోయినట్లే.