
విజయ్ సేతుపతి హీరోగా ఎంత సక్సెస్ అన్నది కోలీవుడ్‌కి తెలుసు. కానీ ఆయన విలన్‌గా ఎంత సక్సెస్‌ఫుల్లో ప్యాన్ ఇండియా ప్రేక్షకులకు తెలుసు. ప్రతి నాయకుడి పాత్రల్లో అంతగా సక్సెస్ అయ్యారు సేతుపతి. అలాంటిది, ఇప్పుడు ఆయన ఓ నిర్ణయం తీసుకున్నారు. ఆ డెసిషన్ వల్ల సేతుపతి ప్యాన్ ఇండియా అభిమానులు షాక్‌లో ఉన్నారు.

మాస్టర్ సినిమాలో విజయ్‌కి ఎంత మంచి రోల్ ఉందో, విజయ్ సేతుపతికి కూడా అంతే గొప్ప రోల్ కుదిరింది. ఈ సినిమాలో సేతుపతి ఓ పాటకు డ్యాన్స్ చేస్తే, రిపీటెడ్‌గా చూసి ఎంజాయ్ చేశారు జనాలు. అంతకు ఏమాత్రం తగ్గకుండా విక్రమ్ సినిమాలో ఆటో నుంచి దిగే సీన్ ఉంటుంది మిస్టర్ సేతుపతికి.

తమిళ్ సినిమాల్లోనే కాదు, రీసెంట్‌గా అట్లీ డైరక్షన్‌లో జవాన్‌లోనూ సూపర్‌డూపర్ రోల్ చేశారు సేతుపతి. ఈ మూవీతో ప్యాన్ ఇండియా ప్రేక్షకుల దృష్టి ఒక్కసారిగా విజయ్ సేతుపతి మీద పడింది. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే, మరోవైపు విలన్‌గానూ మెప్పిస్తున్నారు.

హిందీలో జవాన్ చేయడం కన్నా ముందే, ఆయన హీరోయిన్‌కి తండ్రిగా తెలుగులో ఉప్పెనలో చేశారు. రాయణం కేరక్టర్‌లో ఆయన చూపించిన విలనిజానికి ఒక్కసారిగా ఫిదా అయిపోయింది టాలీవుడ్.

త్వరలో రామ్‌చరణ్‌తో బుచ్చిబాబు చేసే సినిమాలోనూ విలన్‌గా సేతుపతి పేరు వినిపించింది. అయితే ఇకపై నెగటివ్ రోల్స్ చేయనని ప్రకటించారు ఈ స్టార్. హీరోలు, డైరక్టర్లు ఫోన్ చేసి ఆబ్లిగేషన్ అంటూ కథ వినిపిస్తున్నారని, అలా ఇబ్బంది పెట్టవద్దని అడుగుతున్నారు విజయ్ సేతుపతి