హీరోల క్రేజ్‌కు హిట్లే కొలమానం. కానీ అది అందరికీ కాదు.. కొందరికి అందులోంచి మినహాయింపు ఉంటుంది. ఈ లిస్టులో విజయ్ దేవరకొండ కూడా ఉన్నారు. అదేంటి అంత మోసేస్తున్నారు అనుకుంటున్నారా..? మరి ఏం చేస్తాం.. సోషల్ మీడియాలో విజయ్ రచ్చ చూస్తుంటే నిజమే అనిపిస్తుంది మరి. తాజాగా కల్కితో మరోసారి ట్రెండ్ అవుతున్నారు రౌడీ బాయ్. హిట్ ఫ్లాపులతో పనిలేదు.. చేసే సినిమాలతో సంబంధం లేదు.. వరసగా డిజాస్టర్స్ వచ్చినా కెరీర్‌పై ఎఫెక్ట్ పడదు..