
అతని దగ్గర ఫోర్డ్ మస్టాంగ్ కారు ఉంది. దీని ధర 74 లక్షల రూపాయలు. బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ (రూ. 61 లక్షలు), మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఎస్ 350 (రూ. 88 లక్షలు), వోల్వో ఎక్స్‌సి 90 (రూ. 1.31 కోట్లు), ఆడి క్యూ7 (రూ. 80 లక్షలు) ఉన్నాయి.

అలాంటి లెర్నింగ్‌కి ఎప్పుడూ వెనకాడలేదు విజయ్ దేవరకొండ. ఎప్పటికప్పుడు సరికొత్త విషయాలను తెలుసుకుంటూ, వాటిని ప్రెజెంట్ చేస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. ఫ్యామిలీస్టార్ రిలీజ్ తర్వాత జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో ఓ మూవీ చేస్తున్నారు రౌడీ హీరో విజయ్ దేవరకొండ.

ఈ సినిమాకు సంబంధించి అన్నీ పనులు చకచకా జరుగుతున్నాయి. ఇది లైన్లో ఉండగానే నెక్స్ట్ మూవీ పనులు కూడా మొదలుపెట్టేశారు సిల్వర్ స్క్రీన్ టాక్సీవాలా. టాక్సీవాలా డైరక్టర్ రాహుల్ సాంకృత్యాన్‌తో ఓ సినిమా చేస్తున్నారు విజయ్. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది.

పీరియాడిక్ చిత్రంగా తెరకెక్కిస్తోంది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ. విజయ్ బర్త్ డే సందర్భంగా అనౌన్స్ మెంట్ వస్తుంది. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనుంది ఈ మూవీ. రీసెంట్‌గా ఖుషి సినిమాలో కాకినాడ అల్లుడిగా కనిపించారు విజయ్.

ఇప్పుడు రాహుల్ మూవీ కోసం రాయలసీమ యాస నేర్చుకుంటున్నారట. డియర్ కామ్రేడ్ కోసం కూడా స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నారు విజయ్. ఆ తర్వాత నోటా సమయంలో తమిళ్ నేర్చుకున్నారు. ఇప్పుడు రాయలసీమ యాక్సెంట్ కోసం ట్యూషన్‌కి అటెండ్ అవుతున్నారు. ప్రేక్షకులకు సినిమా కనెక్ట్ కావడానికి ఎంత కష్టమైనా పడటానికి రెడీ అంటున్నారు విజయ్.