- Telugu News Photo Gallery Cinema photos Vignesh shivan and Nayanthara wedding video streaming in digital Telugu Actors Photos
Vignesh shivan and Nayanthara: పెళ్లి మాత్రమే కాదు అంతకు మించి.. ఫిలిం ఇండస్ట్రీలో ఇదే ఫస్ట్ టైం..
Vignesh shivan and Nayanthara: రీసెంట్ టైమ్స్‌లో టాలీవుడ్‌లో జరిగిన బిగ్గెస్ట్ వెడ్డింగ్ ఈవెంట్ నయనతార, విఘ్నేష్ శివన్‌ల మ్యారేజ్. ఈ పెళ్లి వేడుక బిగ్గెస్ట్ మాత్రమే కాదు మోస్ట్ అవెయిటెడ్ కూడా అందుకే పెళ్లి వీడియో కోసం ఫ్యాన్స్ కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
Updated on: Aug 10, 2022 | 5:58 PM

రీసెంట్ టైమ్స్‌లో టాలీవుడ్‌లో జరిగిన బిగ్గెస్ట్ వెడ్డింగ్ ఈవెంట్ నయనతార, విఘ్నేష్ శివన్‌ల మ్యారేజ్. ఈ పెళ్లి వేడుక బిగ్గెస్ట్ మాత్రమే కాదు మోస్ట్ అవెయిటెడ్ కూడా అందుకే పెళ్లి వీడియో కోసం ఫ్యాన్స్ కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

డిజిటల్ స్ట్రీమింగ్ కోసం ఇన్నాళ్లు దాచిపెట్టిన ఈ వీడియో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ వీడియోలో పెళ్లి మాత్రమే కాదు అంతకు మించి చాలా సర్‌ప్రైజ్ ఉన్నాయంటున్నారు మేకర్స్.

సాధారణంగా సెలబ్రిటీ వెడ్డింగ్ అంటే అభిమానుల ఫోకస్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. అందుకు తగ్గట్టుగా వెడ్డింగ్ ఈవెంట్‌కు సంబంధించి మినిట్ టు మినిట్ అప్‌డేట్స్ ఇస్తూ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటారు ఫిలిం స్టార్స్.

కానీ ఈ విషయంలోనే కొత్తగా థింక్ చేశారు నయనతార. పెళ్లి వేడుకను కూడా కమర్షియల్‌గా క్యాష్ చేసుకునే ఐడియా వేశారు.

ఇండస్ట్రీ మోస్ట్ అవెయిటెడ్ వెడ్డింగ్ కావటంతో నయన్, విఘ్నేష్‌ల పెళ్లికి కమర్షియిల్ వాల్యూ కూడా కాస్త ఎక్కువగానే ఉంది. ఆ క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటూ టోటల్ ఈవెంట్‌ను ఓటీటీకి అమ్మేసింది ఈ జంట.

అంతేకాదు పెళ్లి వేడుకను కూడా సినిమా స్టైల్‌లో గౌతమ్ మీనన్ డైరెక్షన్‌లో చిత్రీకరించారు. ఈ అప్‌డేట్ చూసిన సినీ జనాలు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మీద ఇలాంటి వెడ్డింగ్ ఇదే ఫస్ట్ అంటున్నారు.

అయితే ఈ ఈవెంట్ వీడియోలో అంతకు మించిన అప్‌డేట్స్ చాలానే సర్‌ప్రైజ్ చేయబోతున్నాయట. కేవలం పెళ్లి ఈవెంట్ మాత్రమే కాకుండా... తమ ప్రేమకథను నయన్, విఘ్నేష్ స్వయంగా చెప్పబోతున్నారన్న హింట్ ఇచ్చారు మేకర్స్.

ఈ న్యూస్ రివీల్ కావటంతో ఈ ప్రేమకథ గురించి మాత్రమే మాట్లాడతారా..? లేక గతంలో ఫెయిల్ అయిన ప్రేమ కథల గురించిన విశేషాలు కూడా ఏమైనా ఉంటాయా అన్న క్యూరియాసిటీ ఆడియన్స్‌లో క్రియేట్ అయ్యింది.

ఈ విషయంలో క్లారిటీ రావాలంటే నయనతార : బియాండ్ ది ఫెయిరీటేల్ రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సింది.

Vignesh Shivan And Nayanthara: రీసెంట్ టైమ్స్‌లో టాలీవుడ్‌లో జరిగిన బిగ్గెస్ట్ వెడ్డింగ్ ఈవెంట్ నయనతార, విఘ్నేష్ శివన్
