
బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ శుభవార్త చెప్పాడు. తాను త్వరలో తండ్రిగా ప్రమోషన్ పొందనున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఈ సందర్భంగా సతీమణి నటాషా దలాల్ బేబీ బంప్‌ను ముద్దాడుతున్నక్యూట్ ఫొటోను ఫ్యాన్స్ తో పంచుకున్నాడీ స్టార్ హీరో. దీంతో వరుణ్ దంపతులకు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

వరుణ్, నటాషాలది ప్రేమ వివాహం. వీరు 2021లో పెళ్లిపీటలెక్కారు. ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం గ్రాండ్ గా జరిగింది.

పెళ్లైన మూడేళ్లకు అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందనున్నారు వరుణ్, నటాషా. 'మేము అమ్మానాన్నలు కాబోతున్నాం.. మీ అందరి ప్రేమ, ఆశీస్సులు కావాలంటూ' ఈ శుభవార్తను పంచుకున్నాడు వరుణ్.

సమంత, సమంత, కరణ్ జోహార్, జాన్వీ కపూర్, మౌని రాయ్, వాణి కపూర్, భూమి పెడ్నేకర్, అర్జున్ కపూర్, మలైకా అరోరా, రాశి ఖన్నా, మానుషి చిల్లర్ తదితరులు వరుణ్, నటాషా దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

సిటాడెల్ వెబ్ సిరీస్ ఇండియన్ వెర్షన్ లో వరుణ్ ధావన్, సమంత జంటగా నటిస్తున్నారు.రాజ్,డీకే తెరకెక్కిస్తోన్న ఈ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ త్వరలోనే స్ట్రీమింగ్ కు రానుంది.