- Telugu News Photo Gallery Cinema photos Vaishnavi Chaitanya Shares Beautifull Saree Photos Goes Viral
Vaishnavi Chaitanya: ఓ బేబీ.. ఎంత ముద్దుగున్నావో.. చీరకట్టులో మతిపోగొట్టేస్తోన్న వైష్ణవి చైతన్య..
యూట్యూబర్ గా సినీప్రయాణం స్టార్ట్ చేసి ఇప్పుడు క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతుంది. కథానాయికగా తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తుంది. మరోవైపు నిత్యం క్రేజీ క్రేజీ ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో నెటిజన్లను కునుకు లేకుండా చేస్తుంది.
Updated on: May 22, 2025 | 8:43 PM

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకుపోతుంది ఈ అచ్చ తెలుగు అమ్మాయి. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా సినీ ప్రయాణం స్టార్ట్ చేసిన ఈ అమ్మడు.. ఆ తర్వాత సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది. స్టార్ హీరోలకు చెల్లిగా, స్నేహితురాలిగా కనిపించింది.

కానీ బేబీ సినిమాతో కథానాయికగా వెండితెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ... తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీంతో వైష్ణవి పేరు టాలీవుడ్ ఇండస్ట్రీలో మారుమోగింది. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ బిజీ హీరోయిన్ గా మారింది.

ఇటీవలే జాక్ సినిమాతో తెలుగు అడియన్స్ ముందుకు వచ్చింది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ మరోసారి తన నటనకు ప్రశంసలు అందుకుంది వైష్ణవి. తాజాగా చేతిలో మరో రెండు మూడు చిత్రాలతో బిజీగా ఉంది.

ఇటీవలే వైష్ణవి చైతన్య తన కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో మరోసారి ఆనంద్ దేవరకొండ సరసన కనిపించనుంది. ఈ సినిమాతోపాటు తెలుగులో మరో రెండు మూడు ప్రాజెక్ట్స్ చేస్తుంది వైష్ణవి.

ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్. నిత్యం క్రేజీ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ సందడి చేస్తుంది. తాజాగా చీరకట్టులో ఈ ముద్దుగుమ్మ కట్టిపడేస్తుంది. కాటుక దిద్దిన కలువ కళ్లు.. చూడచక్కని అందంతో నెటిజన్లను మెస్మరైజ్ చేస్తుంది.




