- Telugu News Photo Gallery Cinema photos Do You Know This Actress Who Was 20 Years In Film Industry Yet No Stardom, She Is Regina Cassandra
Tollywood: స్టార్ హీరోలతో సినిమాలు.. 20 ఏళ్లుగా తెలుగులో క్రేజీ హీరోయిన్.. హిట్టు కోసం ఎదురుచూపులు..
సినీరంగంలో నటిగా రాణించాలంటే అందం, టాలెంట్ తోపాటు కాసింత అదృష్టం కూడా ఉండాల్సిందే. నటిగా తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో కలలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అనేక సవాళ్లు ఎదుర్కొన్న తారలు చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే హీరోయిన్ మాత్రం దాదాపు ఇరవై ఏళ్లుగా సినీరంగంలో తోపు హీరోయిన్. అయినా బ్రేక్ కోసం వెయిట్ చేస్తుంది.
Updated on: May 22, 2025 | 8:54 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోస్ అందరి సరసన నటించింది. దాదాపు 20 ఏళ్లుగా తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉంటుంది. కానీ ఇప్పటివరకు ఈ అమ్మడుకు సరైన బ్రేక్ మాత్రం రాలేదు. తెలుగుతోపాటు తమిళం, మలయాళంలోనూ ఈ అమ్మడు పలు చిత్రాల్లో నటించింది. ఇంతకీ ఈమె ఎవరో తెలుసా.. ?

ఈ ముద్దుగుమ్మ మరెవరో కాదండి.. హీరోయిన్ రెజీనా కసాండ్రా. దాదాపు 20 ఏళ్లుగా సినిమాలు చేస్తుంది. 2005లో సినీరంగంలోకి అడుగుపెట్టి ఇప్పటివరకు అన్ని భాషల్లో కలిపి దాదాపు 40 చిత్రాల్లో నటించింది.

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో నటించింది. అయితే ఇప్పటివరకు అగ్ర హీరోల సరసన నటించింది. కానీ సరైన బ్రేక్ మాత్రం రాలేదు. ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూ బిజీగా ఉంటుంది.

అలాగే ఇప్పుడిప్పుడే విలన్ పాత్రలతోనూ రఫ్పాడిస్తుంది. పాత్రకు తగినట్లుగా గ్లామర్ రోల్స్ చేసేందుకు సైతం వెనకడుగు వేయని ఈ బ్యూటీ..ఇప్పుడు డిఫరెంట్ కథలను ఎంచుకుంటుంది. ఇప్పటికే కొన్ని సినిమాల్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు పోషించింది.

కానీ ఇప్పటికీ ఈ అమ్మడు సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తుంది. అటు సోషల్ మీడియాలోనూ వరుసగా క్రేజీ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ అమ్మడు పూల చీరకట్టులో షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి.




