
పవన్ ప్లానింగ్ ఓ పట్టాన ఎవరికీ అర్థం కావు.. ఈ రోజు రాజకీయం అంటారు.. అంతలోనే సినిమాలు అంటారు.. కానీ పర్ఫెక్ట్ బ్యాలెన్సింగ్‌తో ముందుకెళ్తుంటారు. ఇప్పుడూ ఇదే చేస్తున్నారీయన. పాలిటిక్స్‌కు కాస్త బ్రేక్ దొరకడంతో.. వెంటనే సినిమాలపై కాన్సట్రేట్ చేసారు. చాలా రోజులుగా కదలకుండా ఉండిపోయిన ఉస్తాద్‌ను కదిలించారు పవర్ స్టార్. ఈ షెడ్యూల్ అప్‌డేట్స్ ఏంటి..? ఎన్ని రోజులు ఉంటుంది..?

ఉస్తాద్ భగత్ సింగ్ కంటే తర్వాత మొదలైన భీమ్లా నాయక్, బ్రో సినిమాలు పూర్తవ్వడమే కాదు.. విడుదల కూడా అయ్యాయి. అంతెందుకు మొన్నటికి మొన్న మొదలైన ఓజి షూటింగ్ కూడా చివరికి వచ్చేసింది.

మరో 15 రోజులు షూటింగ్ చేస్తే విడుదలకు సిద్ధమైపోయినట్లే. కానీ అందరికంటే రేస్‌లో ముందున్న ఉస్తాద్ మాత్రం ఇప్పటికి కదిలింది. తాజాగా ఈ చిత్ర షెడ్యూల్‌లో పవన్ జాయిన్ అయ్యారు.

ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ అనుకున్నంత వేగంగా అయితే సాగట్లేదు. ఆ మధ్య 10 రోజుల షెడ్యూల్ తర్వాత పవన్ పాలిటిక్స్‌తో బిజీ అయ్యారు. ఆ తర్వాత బ్రో, ఓజి కోసం హరీష్ శంకర్‌కు బ్రేక్ ఇచ్చారు. ఇన్నాళ్లకు ఉస్తాద్‌కు టైమ్ వచ్చింది. హైదరాబాద్‌లోనే భారీ షెడ్యూల్ మొదలైంది. యాక్షన్ సీన్స్‌తో పాటు కొన్ని పవర్ ప్యాక్డ్ సన్నివేశాలు ప్లాన్ చేస్తున్నారు హరీష్ శంకర్.

ఎట్టి పరిస్తితుల్లో ఎలక్షన్స్‌కు ముందే ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల చేయాలని చూస్తున్నారు పవన్. అందుకే బల్క్ డేట్స్ ఇవ్వాలని చూస్తున్నారు. ఓవైపు రాజకీయాలకు టైమ్ కేటాయిస్తూనే.. మరోవైపు ఉస్తాద్, ఓజి సినిమాలకు డేట్స్ అడ్జస్ట్ చేస్తున్నారు పవన్. 2024 మార్చ్ నాటికి షూటింగ్ పూర్తిచేసి గబ్బర్ సింగ్ విడుదలైన మేలోనే రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి ఎన్నికలకు ముందే 3 సినిమాలతో రావాలని చూస్తున్నారు జనసేనాని.