సినీరంగంలోని సెలబ్రెటీలకు రెమ్యునరేషన్ మామూలుగా ఉండదు. స్థాయినీ, డిమాండ్‌ను బట్టి నటీనటులు కోట్లలో పారితోషికం తీసుకుంటుంటారు. ఐతే హీరోయిన్‌ల కంటే హీరోలే అధిక రెమ్యునరేషన్ అందుకుంటుంటారు.
తెలుగు చిత్రసీమలో హీరోలు గరిష్ఠంగా రూ.2 నుంచి రూ.6 కోట్ల వరకు తీసుకుంటారని టాక్. అయితే ఓ నటి మాత్రం హీరోలను తలదన్నేలా మూడు, నాలుగు నిమిషాల వ్యవధి ఉంటే ఒక్క స్పెషల్ సాంగ్‌కే భారీ మొత్తంలో పారితోషికాన్ని అందుకుంటోంది.
ఆ నటి మరెవరో కాదు ఊర్వశి రౌతేలా. ఈ గ్లామరస్బ్యూటీ తన అందం, అభినయంతో నార్త్టు సౌత్అందరినీ కట్టిపడేస్తోంది. మెగస్టార్ చిరంజీవి మువీ 'వాల్తేరు వీరయ్య'లో బాసు వేర్ ఈజ్‌ది పార్టీ అంటూ ఓ ఊపు ఉపేసిన ఊర్వశీ రౌతేలా ఏకంగా రూ.2 కోట్లు అందుకుందట.
ఆ తర్వాత ఏజెంట్‌లో మువీలోనూ ఛాన్స్ దక్కించుకున్న ఈ బ్యూటీ ఒక్క పాటకు గట్టిగానే తీసుకుందట. పవన్ కల్యాణ్, సాయి తేజ్‌ల కంబోలో వస్తోన్న 'బ్రో' మువీలోనూ 'మై డియర్ మార్కండేయ' స్పెషల్ సాంగ్‌కు చిందులేసిన ఈ బ్యూటీ రూ.2కోట్లు అందుకుందని సమాచారం. దీంతో తెలుగులో వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటూ దూసుకెళ్లోన్న ఈ భామ రెమ్యునరేషన్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ హాట్ బ్యూటీ 'పుష్ప 2'లోని ఓ స్పెషల్ సాంగ్‌లో ఆడిపాడే అవకాశం దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఐతే అందుకు ఏకంగా రూ.6 నుంచి రూ.7 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. ఎనర్జిటిక్ హీరో రామ్ 'స్కంధ' మువీలో 3 నిమిషాల పాటకు రూ.3 కోట్లు డిమాండ్ చేసిందట. అంటే నిమిషానికి రూ.కోటి అన్న మాట.