Keerthi Bhat: ఏముందండి బాబు అమ్మాయి.. కీర్తిని ఇలా చూస్తూ ఉండిపోవాల్సిందే.. బ్యూటిఫుల్ లుక్స్..
బుల్లితెర ప్రేక్షకులకు బాగా తెలిసిన పేరు కీర్తి భట్. మనసిచ్చి చూడు సీరియల్ ద్వారా తెలుగు అడియన్స్ కు పరిచయమైంది కీర్తి. ఆ తర్వాత కార్తీక దీపం సీరియల్ లో డాక్టర్ హిమ పాత్రలో నటించి మరింత దగ్గరయ్యింది. ప్రస్తుతం మధురానగరిలో సీరియల్లో నటిస్తుంది కీర్తిభట్. నటిగా కాకుండా బిగ్ బాస్ సీజన్ 6 ఫైనలిస్ట్‌గా నిలిచి మరింత పాపులారిటి సొంతం చేసుకుంది. కారు ప్రమాదంలో మొత్తం కుటుంబాన్ని కోల్పోయి అనాధగా మారింది. అమ్మ, నాన్న, అన్న, వదిన, అన్న పిల్లలు అందరిని పోగొట్టుకుని.. తీవ్రగాయాలతో బతికింది.