చూస్తుంటే ఈ దేవుడు, దెయ్యం కథలకు ఇప్పట్లో డిమాండ్ తగ్గేలా లేదు. ఎందుకంటే వాటికి సీక్వెల్స్ చేస్తున్నారు కాబట్టి. విరూపాక్ష 2, మా ఊరి పొలిమేర 3, మసూధ 2 ఇవన్నీ దెయ్యాలకు కేరాఫ్ అడ్రస్ అయితే.. అఖండ 2, కార్తికేయ 3, జై హనుమాన్ లాంటి సినిమాలన్నీ దేవుడి మహత్యం చూపించబోతున్నాయి. మొత్తానికి దెయ్యం, దేవుడు కలిసి టాలీవుడ్‌ను కమ్మేసారన్నమాట.