
అభిషేక్ బచ్చన్ రాజకీయాల్లోకి వస్తారని నార్త్ లో ప్రచారం జరుగుతోంది. విక్రమ్ హీరోగా తెరకెక్కిన సినిమా 'ధ్రువనక్షత్రం'. షారుఖ్ ఖాన్ కోసమే తాను 'జవాన్' మూవీలో నటించానని అన్నారు విజయ్ సేతుపతి. మణిరత్నం దర్శకత్వంలో మరోసారి నటించనున్నారు నాయిక త్రిష. కీర్తీ సురేష్ హీరోయిన్‌గా కొత్త సినిమా మొదలైంది.

అభిషేక్ బచ్చన్ రాజకీయాల్లోకి వస్తారని నార్త్ లో ప్రచారం జరుగుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీలో చేరుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందని అంటున్నారు. అయితే దీని గురించి ఇప్పటిదాకా స్పందించలేదు అభిషేక్. ఆయన కేమియో అప్పియరెన్స్ ఇచ్చిన భోళా ఆ మధ్య విడుదలైంది. ఘూమర్ షూటింగ్ పూర్తయింది.

కీర్తీ సురేష్ హీరోయిన్‌గా కొత్త సినిమా మొదలైంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ మూవీని తెరకెక్కిస్తోంది. 'కన్నెవెడి' అనే పేరు పెట్టారు ఈ చిత్రానికి. ''నా నెక్స్ట్ ప్రాజెక్ట్ 'కన్నెవెడి'. అందరి ప్రేమాభిమానాలు, సహాయసహకారాలు కావాలి''... అంటూ ట్వీట్ చేశారు కీర్తీ సురేష్. దసరా, నాయకుడు హిట్ కావడంతో జోష్ మీదున్నారు కీర్తీ సురేష్.

మణిరత్నం దర్శకత్వంలో మరోసారి నటించనున్నారు నాయిక త్రిష. రీసెంట్ టైమ్స్ లో 'పొన్నియిన్ సెల్వన్' రెండు పార్టుల్లోనూ నటించారు త్రిష. ఆమె చేసిన కుందవై కేరక్టర్ జనాలకు బాగా కనెక్ట్ అయింది. మణిరత్నం మెడ్రాస్ టాకీస్ మీద ఓ సినిమాను నిర్మిస్తున్నారు. కమల్ హాసన్ హీరోగా చేస్తున్నారు. ఆ మూవీ కోసమే త్రిషను సెలక్ట్ చేశారనే ప్రచారం సాగుతోంది.

షారుఖ్ ఖాన్ కోసమే తాను 'జవాన్' మూవీలో నటించానని అన్నారు విజయ్ సేతుపతి. పారితోషికం రూపాయి ఇవ్వకపోయినా, ఆయనతో కలిసి నటించేవాడినని అన్నారు. అట్లీ దర్శకత్వం వహిస్తున్న జవాన్‌లో విలన్‌గా నటించారు విజయ్ సేతుపతి. సెప్టెంబర్ 7న విడుదల కానుంది జవాన్. ఇటీవల విడుదలైన ప్రివ్యూకి మంచి స్పందన వస్తోంది.

విక్రమ్ హీరోగా తెరకెక్కిన సినిమా 'ధ్రువనక్షత్రం'. రీతు వర్మ నాయికగా నటించారు. 2017లో మొదలైంది ఈ మూవీ. కొంత భాగం షూటింగ్ లండన్‌లో చేశారు. 2018లో విడుదల కావాల్సింది. అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఇప్పుడు మూవీని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సెకండ్ సింగిల్‌ని ఈ నెల 17న విడుదల చేస్తామని అనౌన్స్ చేశారు మేకర్స్.