
సినిమా స్క్రీన్ మీద సక్సెస్ కావాలంటే... కథాబలం ఎంత అవసరమో, కథ జరిగే నేపథ్యం కూడా అంతే కీలకం. అందుకే కాస్త ఇంటెన్స్ ఉన్న కథలను చెప్పాల్సి వచ్చినప్పుడు పీరియడ్‌కి ఫిక్స్ అవుతున్నారు మేకర్స్. ఇప్పుడు సెట్స్ మీదున్న యంగ్ హీరోల సినిమాల్లోనూ పీరియాడికల్ టచ్ కనిపిస్తోంది. ఇంతకీ ఎవరు ఆ హీరోలు? కమాన్ లెట్స్ వాచ్...

కలలో కూడా ఊహించలేదని అంటారే... కార్తికేయ సినిమా హిట్ అయినప్పుడు ఈ మాట బాగా వినిపించింది. ఆ సినిమా ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో కార్తికేయ2 తీస్తే అది కూడా సూపర్‌డూపర్ హిట్ అయింది. ఈ సక్సెస్‌ల తర్వాత ప్యాన్ ఇండియా మార్కెట్లో నిఖిల్ స్టోరీ సెలక్షన్ మీద కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. స్వయంభు సినిమా అనౌన్స్ మెంట్ వచ్చీరాగానే క్రేజ్ రావడానికి ఇదే మెయిజ్ రీజన్. చాలా పాజిటివ్ టైటిల్ అంటూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న స్వయంభు పీరియాడిక్ డ్రామాగానే తెరకెక్కుతోంది.

ఇటీవల పెళ్లి చేసుకుని ఓ ఇంటి వాడయ్యారు వరుణ్‌తేజ్. ఏరియల్ యాక్షన్ డ్రామాగా ఇటీవల ఆపరేషన్ వేలంటైన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. యాక్షన్ పరంగా బావున్నా, ఇంటెన్సిటీ లేదన్న కారణంతో జనాల ఆదరణకు నోచుకోలేకపోయింది ఈ సినిమా.

పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలని ఫిక్సయ్యారు వరుణ్ తేజ్. ఇంటెన్స్ స్టోరీతో మట్కా అనే సినిమా చేస్తున్నారు. ఓపెనింగ్ బ్రాకెట్‌ని చూసిన వారికి ఎవరికైనా.. మట్కా పీరియాడిక్ డ్రామా అనే విషయం ఇట్టే అర్థమైపోతుంది.

అక్కినేని చిన్నోడు అఖిల్‌కి కూడా ఓ హిట్ కావాలి. అందుకే ఆయన కూడా పీరియాడిక్ కాన్సెప్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అఖిల్ హీరోగా యువీ క్రియేషన్స్ తెరకెక్కిస్తున్నది ఈ పీరియాడిక్ సబ్జెక్ట్ నే. అనిల్ అనే నయా డైరక్టర్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఏజెంట్ లాంటి ఫ్లాప్‌ని మర్చిపోయే హిట్ కావాలంటే, పీరియాడిక్ కాన్సెప్టే పర్ఫెక్ట్ అనుకున్నారట అఖిల్.