
అందాల ముద్దుగుమ్మ శ్రియా శిరన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నో సినిమాల్లో నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఆ రోజుల్లో తన గ్లామర్‌తో కుర్రకారును మాయ చేసింది ఈ బ్యూటీ. ఎంతో మంది కలల యువరాణిగా మారిపోయింది.

ముఖ్యంగా నువ్వే నువ్వే, నేనున్నాను వంటి సినిమాల ద్వారా మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. స్టార్ హీరోల సరసన నటించి ఈ బ్యూటీ తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇక ఈ అమ్మడు చివరగా, పవిత్ర సినిమాలో నటించింది. తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది. కానీ అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా తమ అభిమానులను పలకరిస్తూనే ఉంటుంది ఈ చిన్నది.

శ్రియా శిరన్‌కు ఒక కూతురు పుట్టిన విషయం తెలిసిందే. అప్పుడప్పుడు తన పాపతో దిగిన ఫొటోలను ఇన్ స్టాలో షేర్ చేస్తుంటుంది. తాజాగా ఈ బ్యూటీ, తన కూతురు రాధాతో కలిసి ఏంజాయ్ చేసిన ఫొటోలను పంచుకుంది.

చూడటానికి చాలా క్యూట్‌గా కనిపిస్తుంది శ్రియా కూతురు. అంతే కాకుండా తన తల్లిని ప్రేమతో హత్తుకున్న ఫొటోస్ చూస్తే, స్టార్ అయినే కూతురు వద్ద చిన్నపాపే అంటూ కామెంట్స్ చేస్తున్నారు తన ఫ్యాన్స్.