డైలమాలో అరడజన్‌ సినిమాల సీక్వెల్స్.. టెన్షన్‌లో ఫ్యాన్స్..

Edited By: Phani CH

Updated on: Sep 23, 2025 | 11:28 PM

సీక్వెల్స్ సీక్వెల్స్.. ఇప్పుడెక్కడ చూసినా ఇవే కనిపిస్తున్నాయి. ఒకటి రెండు కాదు.. టాలీవుడ్ రాబోయే మూడేళ్లలో దాదాపు అరడజన్‌కు పైగా క్రేజీ సీక్వెల్స్ రెడీ అవుతున్నాయి. వీటి బిజినెస్ రేంజ్ అంతా లెక్కేస్తే దాదాపు 10 వేల కోట్లు ఉంటుందని అంచనా. అయితే ఇక్కడే చిన్న చిక్కొచ్చి పడింది. అదేంటో ఎక్స్‌క్లూజివ్‌లో చూద్దాం..

1 / 5
నీ టైమ్ నడుస్తుందిరా బాబూ అన్నట్లు.. టాలీవుడ్‌లో సీక్వెల్స్ టైమ్ నడుస్తుందిప్పుడు. ప్రతీ కథకు కొనసాగింపు రాయడం అనేది కామన్ అయిపోయిందిప్పుడు. అఖండ 2 డిసెంబర్‌లోనే రానుంది. 600 మంది డాన్సర్లతో భారీ సెట్‌లో మాస్ సాంగ్ చిత్రీకరణ జరుగుతుందిప్పుడు. సీక్వెల్స్‌లో త్వరగా వస్తుంది అఖండ 2నే. మిగిలినవన్నీ కన్ఫ్యూజన్‌లోనే ఉన్నాయి.

2 / 5
దేవర 2 సినిమా ఉంటుందని మేకర్స్ చెప్తున్నారు కానీ వచ్చేవరకు అనుమానమే. కొరటాల శివ ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తి చేసారు.. మరోవైపు ప్రశాంత్ నీల్ తర్వాత త్రివిక్రమ్, నెల్సన్ లాంటి దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

3 / 5
ఇక సలార్ 2, కల్కి 2 కూడా ఇప్పట్లో లేనట్లే. ప్రభాస్ ప్రస్తుతం ఉన్న బిజీకి ఇవి మొదలవ్వడానికే ఏళ్లు పట్టేలా ఉంది. సలార్ 2 ఇప్పట్లో ఉండదని ప్రశాంత్ నీల్ కన్ఫర్మ్ చేసారు.. మరోవైపు కల్కి 2 కూడా అంత ఈజీ కాదని.. అందరి డేట్స్ దొరికిన తర్వాత కానీ దీన్ని మొదలుపెట్టలేం అంటున్నారు నాగ్ అశ్విన్.

4 / 5
ఇక జై హనుమాన్ అనౌన్స్ ఐతే చేసారు కానీ ఎప్పుడు పట్టాలెక్కుతుందో చెప్పడం కష్టమే. మరోవైపు మిరాయ్ 2 రావడానికి మూడేళ్లు పట్టే అవకాశం ఉంది.

5 / 5
ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న సీక్వెల్స్ అన్నీ ఇప్పుడో అప్పుడో వస్తాయనే నమ్మకం ఉంది.. కానీ పుష్ప 3, కేజియఫ్ 3 మాత్రం అసలు వస్తాయా అనే డౌట్ ఫ్యాన్స్‌లోనూ ఉంది. 2027లో పుష్ప 3 మొదలుపెడతానంటూ కన్ఫర్మ్ చేసారు సుకుమార్.. మరోవైపు కేజియఫ్ 3పై ప్రశాంత్ నీల్ అసలు నోరే మెదపట్లేదు. మొత్తానికి ఈ సీక్వెల్స్ అన్నీ ఉన్నాయి.. కానీ ఎప్పుడొస్తాయో తెలియదు.