
ఛైల్డ్ ఆర్టిస్టుగా మొదలెట్టి స్టార్ హీరోయిన్ గా ఎదిగి దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నటి మీనా. సినిమా ఇండస్ట్రీలో ఆమెది సుమారు 40 ఏళ్ల ప్రస్థానం. ఇప్పటికీ సినిమాలతో బిజీగా ఉంటోందీ అందాల తార

ఇదిలా ఉంటే సోమవారం (సెప్టెంబర్ 16) మీనా పుట్టిన రోజు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు మీనాకు బర్త్ డే తెలిపారు

ఇక నటి మీనా పుట్టిన రోజు వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ సెలబ్రేషన్స్ లో సీనియర్ నటులు, నటీమణులు, స్నేహితులు, సన్నిహితులు సందడి చేశారు

సీనియర్ నటి సంగీత, నటుడు శరత్ కుమార్ అలాగే పలువురు సినీ ప్రముఖులు మీనా పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు. ఆమెతో కేక్ కట్ చేయింది బర్త్ డే విషెస్ చెప్పారు.

మీనా పుట్టిన రోజు వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన పోలీసోడు (తమిళ్ లో తేరీ) సినిమాతో మీనా కూతురు నైనికా కూడా ఛైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చింది.