
ప్యాన్ ఇండియన్ సినిమా అంటే కేరాఫ్ సౌత్ సినిమా మరీ ముఖ్యంగా కేరాఫ్ తెలుగు సినిమా అయిపోయిందిప్పుడు. ఇండియన్ ఆడియన్స్ నాడి పట్టుకోవడం మన దర్శకులకు తెలిసినంతగా మరే ఇండస్ట్రీ దర్శకులకు తెలియదంటే అతిశయోక్తి కాదేమో..? ఎందుకంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇప్పుడు ఇండియన్ సినిమాను రూల్ చేస్తున్నదే తెలుగు సినిమా.

2015, జులై 10.. తెలుగు సినిమా గతిని, వేగాన్ని మార్చేసిన డేట్ ఇది. ఆ రోజే రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి విడుదలైంది. తెలుగు సినిమా పక్కనున్న తమిళ ఇండస్ట్రీకి కూడా పాకని రోజుల్లో.. ఏకంగా బాలీవుడ్ తీసుకెళ్లి అక్కడి ఆడియన్స్‌తో విజిల్స్ వేయించిన ఘనత రాజమౌళిదే. ఆ తర్వాత బాహుబలి 2తో అక్కడే జెండా పాతేసారు జక్కన్న. కేజియఫ్‌తో అది ఇంకాస్త కంటిన్యూ అయింది.

రాజమౌళి వేసిన బాటలో ప్రశాంత్ నీల్ కూడా నడిచారు. కేజియఫ్ సిరీస్ బాలీవుడ్‌ను దున్నేసింది. అలాగే ట్రిపుల్ ఆర్‌తో మరోసారి నార్త్ ఆడియన్స్ నాడి పట్టుకున్నారు రాజమౌళి.

ఇక కాంతారాతో రిషబ్ శెట్టి.. కార్తికేయ 2తో చందూ మొండేటి సైతం హిందీ ఆడియన్స్‌ను మురిపించారు. సాహో, కల్కితో ప్రభాస్ పూర్తిగా బాలీవుడ్ హీరో అయిపోయారు.

పుష్ప 2తో 1800 కోట్లు వసూలు చేసారు అల్లు అర్జున్. ప్యాన్ ఇండియన్ సినిమాల్లో మన దర్శకులకున్న సక్సెస్ రేట్ ఎవరికీ లేదు. కంగువా, తంగలాన్, పొన్నియన్ సెల్వన్ లాంటి తమిళ సినిమాలు ప్యాన్ ఇండియన్ కాలేదు. ఉన్నంతలో కన్నడ కాస్త బెటర్. ఎలా చూసుకున్నా.. ప్యాన్ ఇండియన్ సినిమాను రూల్ చేస్తున్నదైతే టాలీవుడ్డే. నెక్ట్స్ కూడా స్పిరిట్, రాజా సాబ్, దేవర 2, RC16 లైన్‌లో ఉన్నాయి.