Pan Indian Movies: పాన్ ఇండియా రూట్ మార్చేస్తున్న హీరోలు.. సెంటిమెంట్‌తోనూ పాన్ ఇండియన్ దండయాత్ర..
పాన్ ఇండియన్ స్థాయిలో ఓ సినిమా విడుదల కావాలంటే భారీ తనం ఉండాలి.. విజువల్ వండర్ అయ్యుండాలి.. భారీ బడ్జెట్ పెట్టాలనే రోజులు పోయాయి. ఇప్పుడంతా కొత్తగా ప్రయత్నిస్తున్నారు మన హీరోలు. మనసును హత్తుకునే సెంటిమెంట్‌తోనూ పాన్ ఇండియన్ దండయాత్ర చేస్తున్నారు. యాక్షన్ సినిమాలు హ్యాండ్ ఇస్తుండటంతో రూట్ మార్చేసారు. దారి మారిన పాన్ ఇండియా సినిమాలపైనే ఇవాల్టి మన ఎక్స్‌క్లూజివ్ స్టోరీ..
Updated on: Jan 30, 2024 | 12:42 PM

తమ సినిమాలను అన్ని భాషల్లో విడుదల చేయడాన్ని కొందరు హీరోలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కంగారు పడి కంటెంట్ లేని సినిమాలు తీసుకెళ్లి చేతులు కాల్చుకుంటున్నారు. ఈ గుణపాఠంతోనే రూట్ మార్చి పాన్ ఇండియన్ మార్కెట్ కోసం కొత్త దారి వెతుకుతున్నారు. మాస్, యాక్షన్, విజువల్ వండర్స్ కాకుండా ప్యూర్ ఎమోషన్‌తో కొట్టాలని చూస్తున్నారు.

లైగర్‌తో పాన్ ఇండియన్ ఎంట్రీ ఇచ్చారు విజయ్ దేవరకొండ. కానీ సినిమాలో కంటెంట్ లేక వర్కవుట్ అవ్వలేదు. లైగర్‌తో వచ్చిన క్రేజ్ వాడుకుంటూ ఖుషీని అన్ని భాషల్లో రిలీజ్ చేసారు. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్‌ను తెలుగు, తమిళంలో తీసుకొస్తున్నారు. అలాగే గౌతమ్ తిన్ననూరి సినిమా ప్యూర్ యాక్షన్ డ్రామా.. దాన్ని మళ్లీ హిందీలోనూ విడుదల చేయాలని చూస్తున్నారు విజయ్.

నాని కూడా విజువల్ వండర్స్‌తో కాదు ఎమోషనల్‌గానే అందర్నీ కవర్ చేయాలని చూస్తున్నారు. దసరా, హాయ్ నాన్నతో ఇదే ప్రయత్నం చేసారు నాని. తనకు ఒకేసారి బ్లాక్‌బస్టర్ అక్కర్లేదని.. మెల్లగా తెలిస్తే చాలంటున్నారు నాని. అందుకే సరిపోదా శనివారంతో పాటు తర్వాత చేయబోయే సినిమాలను సైతం అన్ని భాషల్లో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు న్యాచురల్ స్టార్.

కంటెంట్ బాగుంటే.. భారీ తనంతో పనిలేదని హనుమాన్, కార్తికేయ 2, కాంతార లాంటి విజయాలే నిరూపించాయి. ప్రభాస్, మారుతి కాంబినేషన్‌లో వస్తున్న రాజా సాబ్, నాగ చైతన్య తండేల్, అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాలు ఎమోషనల్‌గానే ఉంటాయి కానీ విజువల్ వండర్స్ కాదు. గేమ్ ఛేంజర్ కూడా పొలిటికల్ సినిమానే. ఇక దేవర, విశ్వంభర, ప్రాజెక్ట్ కే విజువల్ బేస్డ్‌గా రూపొందుతున్నాయి.