
సాయిదుర్గా తేజ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. 1940ల నేపథ్యంలో సాగే ఆసక్తికరమైన కథాంశంతో రూపొందనుంది. తేజ్ ఇంతకు మునుపెన్నడూ చేయని వైవిధ్యమైన పాత్రలో కనిపిస్తారని టాక్. హనుమాన్ చిత్ర నిర్మాత నిరంజన్ రెడ్డి ఈ సినిమాను రూపొందిస్తారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. జులై నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది.

ముంబైలో వార్2 షూటింగ్‌లో బిజీగా ఉన్నారు ఎన్టీఆర్. అక్కడ జరిగే బీ టౌన్ పార్టీలకు కూడా హాజరవుతున్నారు. రణ్‌బీర్ కపూర్, ఆలియా, హృతిక్ రోషన్, కరణ్ జోహార్ ఏర్పాటు చేసిన పార్టీకి భార్యతో కలిసి వెళ్లారు ఎన్టీఆర్.

ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటిస్తున్న సినిమా వార్2. ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలోని ఓ కీలక యాక్షన్ సీక్వెన్స్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్స్ వేస్తున్నారు. ఈ సీక్వెన్స్ లో ఎన్టీఆర్, హృతిక్ పాల్గొంటారు. మే రెండో వారం నుంచి ఈ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేయనున్నారు.

సిద్ధార్థ్ పరిచయం కావడం వల్ల ప్రేమపై తనకు నమ్మకం పెరిగిందని అన్నారు నటి అదితిరావు హైదరి. ప్రేమ ఉన్న చోట గౌరవం తప్పనిసరిగా ఉంటుందని అన్నారు. సెలబ్రిటీలు కూడా మనుషులే అని అందరూ గుర్తుపెట్టుకోవాలని అన్నారు. సెలబ్రిటీల ప్రైవసీకి భంగం కలిగించకూడదని కోరారు అదితిరావు.

ఆల్రెడీ శ్రీరామరాజ్యం సినిమాలో సీతగా నటించారు నయనతార. ఆ పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత, ఎం.ఎస్.సుబ్బులక్ష్మి కేరక్టర్‌కి నయన్ కూడా ఉంటారనే టాక్స్ నడుస్తున్నాయి.

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న సినిమా తండేల్. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా డిజిటల్ రైట్స్ నెట్‌ఫ్లిక్స్ తీసుకుంది. దక్షిణాది భాషలతో పాటు హిందీని కూడా కలిపి 40 కోట్లకు నెట్‌ఫ్లిక్స్ కైవసం చేసుకుంది. అల్లు అరవింద్ సమర్పిస్తున్న సినిమా తండేల్.