Top 5 ET News: నయా మూవీస్ క్రేజీ న్యూస్.. టాప్ 5 ఫిలిమ్స్ అప్డేట్స్

| Edited By: Rajeev Rayala

Jul 24, 2023 | 5:22 PM

మోహన్ లాల్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా 'వృషభ' ఓపెనింగ్ జరిగింది. నంద కిషోర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్ తనయుడు రోషన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

1 / 5
వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో ఆక‌ట్టుకుంటూ విల‌క్ష‌ణ న‌టుడిగా త‌న‌దైన గుర్తింపు తెచ్చుకున్నారు తిరువీర్. తాజాగా ఓ ప్రముఖ ఓటిటి సంస్థలో తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ ‘మిషన్ తషాఫి’లో ఆయ‌న ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ప్రవీణ్ సత్తారు దీనికి దర్శకుడు. జులై 23న తిరువీర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ విషయాన్ని తెలిపారు మేకర్స్.

2 / 5
మోహన్ లాల్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా 'వృషభ' ఓపెనింగ్ జరిగింది. నంద కిషోర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్ తనయుడు రోషన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. మోహన్ లాల్ కొడుకు పాత్రలో ఆయన కనిపిస్తున్నారు. రోషన్‌కు జోడీగా బాలీవుడ్ హీరో సంజయ్ కపూర్ కుమార్తె షనాయా కపూర్ జంటగా నటిస్తున్నారు.

3 / 5
మాచర్ల నియోజకవర్గం లాంటి మాస్ సినిమా తర్వాత నితిన్ నటిస్తున్న సినిమా ఎక్స్‌ట్రా. దీనికి ఆర్డినరీ మ్యాన్ అనే ట్యాగ్ లైన్ పెట్టారు. వక్కంతం వంశీ దీనికి దర్శకుడు. నా పేరు సూర్య తర్వాత ఈయన తెరకెక్కిస్తున్న సినిమా ఇది. ఇందులో శ్రీలీల హీరోయిన్. ఈ సినిమాను డిసెంబర్ 23, 2023కి ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అదే సీజన్‌లో సైంధవ్, హాయ్ నాన్న సినిమాలు కూడా రానున్నాయి.

4 / 5
శ్రీవిష్ణు, రెబ్బా మోనికా జాన్ జంటగా వచ్చిన సినిమా సామజవరగమనా. జూన్ 29న విడుదలైన ఈ చిత్రం 50 కోట్లకు పైగా వసూలు చేసి సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. వివాహ భోజనంబు ఫేమ్ రామ్ అబ్బరాజు దీనికి దర్శకుడు. రాజేష్ దండా నిర్మించిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తోనే రెబ్బా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఇంత మంచి సినిమాతో తాను ఎంట్రీ ఇచ్చినందుకు.. తెలుగు ఆడియన్స్ అంతా తనను యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పారు.

5 / 5
బేబీ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ నేపథ్యంలోనే ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్‍తో పాటు నిర్మాత SKN తిరుమలను సందర్శించారు. బేబీ సినిమా ఘన విజయం సాధించటంతో ప్రస్తుతం ఆ మూవీ టీమ్ సక్సెస్ టూర్ చేస్తోంది. ఈ క్రమంలోనే ముందు తిరుమలకు వెళ్లింది ఆ చిత్ర బృందం.