సక్సెస్ సాధించటం కాదు.. సక్సెస్ తరువాత ఆ ట్రెండ్‌ను కంటిన్యూ చేయటం చాలా కష్టం. అందుకే మన హీరోలు ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ వస్తే ఆ తరువాత చేయబోయే సినిమా విషయంలో ఎక్స్‌ట్రా కేర్ తీసుకుంటుంటారు. అందుకే హాలీవుడ్ స్టైల్ ఆఫ్ ఫిలిం మేకింగ్‌ను మన దగ్గర ఇంప్టిమెంట్ చేస్తున్నారు టాప్ హీరోలు.
ట్రిపులార్ రిలీజ్ తరువాత నెక్ట్స్ మూవీని స్టార్ట్ చేసేందుకు లాంగ్ బ్రేక్ తీసుకున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ గ్యాప్‌లో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా కంప్లీట్ చేసేశారు. ఆ టైమ్‌లో ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేసిన జూనియర్, వన్స్ మూవీ సెట్స్ మీదకు వచ్చిన దగ్గర నుంచి బ్రేక్ తీసుకోకుండా షూటింగ్ కానిచ్చేస్తున్నారు.
ఆల్రెడీ సెట్స్, షెడ్యూల్స్‌కు సంబంధించి ప్రిపరేషన్ అంతా పూర్తయిపోవటంతో వరుసగా యాక్షన్ సీక్వెన్స్‌ల షూటింగ్ చేస్తున్నారు కొరటాల. జనతా గ్యారేంజ్‌లాంటి బిగ్ హిట్ తరువాత ఈ కాంబోలో వస్తున్న మూవీ కావటంతో ఆ అంచనాలను అందుకునే రేంజ్ సెటప్ సిద్ధం చేస్తున్నారు.
సర్కారువారి పాట రిలీజ్ తరువాత త్రివిక్రమ్ కాంబినేషన్‌లో గుంటూరు కారం సినిమా ఎనౌన్స్ చేసిన మహేష్ కూడా వర్క్ విషయంలో డిఫరెంట్ స్ట్రాటజీతో వెళుతున్నారు. కాస్టింగ్ విషయంలో చిన్న చిన్న డిలేస్ ఎదురవుతున్నా... సంక్రాంతి నాటికి సినిమా పక్కాగా రెడీ అవుతుందన్న కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు మేకర్స్. ఆ కాన్ఫిడెన్స్‌కు కారణం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్‌లో చేసిన వర్కే అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.
ప్రజెంట్ గేమ్ చేంజర్ వర్క్‌లో బిజీగా ఉన్న రామ్ చరణ్ కూడా తారక్, మహేష్‌నే ఫాలో అవుతున్నారు. సెట్స్ మీద ఉన్న సినిమా షూటింగ్‌తో పాటు బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా ప్యారలల్‌గా జరుగుతోంది. సెట్స్, లోకేషన్స్, డేట్స్, షెడ్యూల్స్ ఇలా అన్ని విషయాల్లోనూ పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో రెడీ అవుతున్నారు మేకర్స్.
గేమ్ చేంజర్ షూటింగ్ పూర్తయిన వెంటనే మేకోవర్ కోసం షార్ట్ గ్యాప్ తీసుకొని బుచ్చిబాబు సెట్‌లోకి అడుగుపెడతారు చెర్రీ. వన్స్ షూటింగ్ స్టార్ట్ అయితే ఎట్ ఏ స్ట్రెచ్ సినిమా అంతా కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇలా టాప్ స్టార్స్ అంతా పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో వర్క్ చేస్తుండటంతో అప్ కమింగ్ సినిమాల మీద అంచనాలు కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి.