
కొత్త ఏడాదికి కొత్త లుక్స్‌తో స్వాగతం పలికారు టాలీవుడ్ మేకర్స్. కేవలం విషెస్ పోస్టర్స్ రిలీజ్ చేయటమే కాదు... ఆ పోస్టర్స్‌తో అభిమానుల్లో ఉన్న అనుమానాలకు చెక్ పెట్టారు. ఈ అప్‌డేట్స్‌తో న్యూ ఇయర్ టాలీవుడ్‌లో కొత్త జోష్ తీసుకువచ్చింది.

ఈ అప్‌డేట్‌తో టాలీవుడ్ ఆడియన్స్ మాత్రమే కాదు ఇండియన్ మూవీ లవర్స్ అంతా పండుగ చేసుకుంటున్నారు. 2025 ఫస్ట్ క్వార్టర్‌లో రిలీజ్ అవుతున్న అన్ని సినిమాల నుంచి అప్‌డేట్స్ ఇచ్చారు మేకర్స్.

రామ్ హీరోగా తెరకెక్కుతున్న నెక్ట్స్ మూవీ నుంచి హీరో హీరోయిన్ల లుక్స్ రివీల్ చేశారు దర్శక నిర్మాతలు. ఇక ఫన్ సిరీస్‌లో భాగంగా తెరకెక్కుతున్న మ్యాడ్ స్క్వేర్ టీమ్ కూడా సినిమా కంటెంట్‌కు తగ్గట్టుగా ఇంట్రస్టింగ్‌గా న్యూ ఇయర్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఈ అప్‌డేట్స్‌తో తెలుగు ఆడియన్స్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మరింత స్పెషల్‌గా మారిపోయాయి.

టాలీవుడ్ ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ అప్‌డేట్ వచ్చేసింది. మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కబోయే సినిమా గురువారం లాంఛనంగా ప్రారంభం కానుంది.

న్యూ ఇయర్ పోస్టర్‌తో మరోసారి రిలీజ్ డేట్‌ను కన్ఫార్మ్ చేసింది హరి హర వీరమల్లు టీమ్. న్యూ ఇయర్ విషెస్‌తో పాటు ట్రైలర్ లాంచ్ విషయంలోనూ క్లారిటీ ఇచ్చింది గేమ్ చేంజర్ యూనిట్. బాలయ్య యాక్షన్ లుక్ పోస్టర్‌తో సినిమా మీద అంచనాలు పెంచేసింది డాకూ మహరాజ్ టీమ్.