
విశ్వంభర కోసం జిమ్‌లో వర్కవుట్లు చేసి మరీ ఫిట్‌గా తయారవుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. వశిష్ట డైరక్ట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ కొల్లూరులో ఉన్న గుంటూరు కారం సెట్లో జరుగుతోంది. మెగాస్టార్‌తో పాటు సౌత్ క్వీన్ త్రిష కూడా షూటింగ్‌లో పార్టిసిపేట్ చేస్తున్నారు.

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరక్షన్‌లో రూపొందుతున్న భారతీయ ఇతిహాసం సైన్స్-ఫిక్షన్ డిస్టోపియన్ చిత్రం కల్కి 2898 ఏడి షూటింగ్ శంకరపల్లిలో జరుగుతోంది. ఇందులో దీపికా పాడుకొనే కథానాయక. ఈ సినిమా ఈ ఏడాది మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

లాస్ట్ ఇయర్ పక్కా తెలుగు సినిమా సర్‌తో ప్రేక్షకులను మెప్పించారు ధనుష్. ఈ ఏడాది కూడా తెలుగులో ఓ సినిమా చేస్తున్నారు. శేఖర్ కమ్ముల కెప్టెన్సీలో అక్కినేని నాగార్జున, ధనుష్ కలిసి నటిస్తున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప2 సినిమా కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు కెప్టెన్ సుకుమార్.

నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ప్రస్తుతం కాచిగూడ లో షూటింగ్ జరుపుకుంటోంది. అటు అడివి శేష్ హీరోగా నటిస్తున్న గూఢచారి 2 సినిమాను హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నారు.

మలయాళంకన్నా తెలుగు మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు దుల్కర్ సల్మాన్. ఓ వైపు తన సినిమాల్లో హీరోగా నటిస్తూ, మరోవైపు ఇతర స్టార్ హీరోలతో కలిసి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఆయన హీరోగా నటిస్తున్న లక్కీ భాస్కర్ సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీ లో జరుగుతుంది