
కథ చెప్పినపుడు దర్శకులను పూర్తిగా నమ్మేస్తుంటారు నిర్మాతలు. వాళ్ళేం చెప్తే దానికి సై అంటుంటారు. మరోవైపు హీరోలు కూడా దాదాపు దర్శకులు ఏం చెప్తే అది చేస్తుంటారు. మరి అంత ఫ్రీడమ్ దొరికినపుడు కనీసం మంచి సినిమా చేయలేరా.. ఒకవేళ బాలేని సినిమా చేసినా బడ్జెట్ కంట్రోల్ చేయలేకపోతున్నారా..?

తాజాగా మరో తలాతోక లేని సినిమా వచ్చింది. ఈ రోజుల్లో మీడియం రేంజ్ హీరోలకు కూడా 50 కోట్ల బడ్జెట్ కామన్ అయిపోయింది. ఇక స్టార్ హీరోలకైతే చెప్పనక్కర్లేదు. అందులోనూ స్టార్ డైరెక్టర్స్ చేస్తున్న సినిమాలకు వందల కోట్ల బడ్జెట్ అవుతుంది.

అంత ఖర్చు పెడుతున్నపుడు వచ్చే రిజల్ట్ కూడా అలాగే ఉండాలని కోరుకుంటారు నిర్మాతలు.. కానీ ఇక్కడే తేడా కొడుతుంది. హీరో బడ్జెట్ 40 కోట్లైతే.. 80 కోట్లతో సినిమాలు తెరకెక్కిస్తున్నారు దర్శకులు. తాజాగా పెదకాపు సినిమా విడుదలైంది.

శ్రీకాంత్ అడ్డాలకు కొన్నేళ్లుగా సరైన హిట్ లేదు.. మరోవైపు హీరో, హీరోయిన్ ఇద్దరూ కొత్తవాళ్లే. కానీ బడ్జెట్ మాత్రం భారీగా పెట్టించారు దర్శకుడు. ప్రమోషన్స్ బాగానే చేసుకున్నా.. థియేటర్స్‌లో కనీసం ఓపెనింగ్స్ లేవు.. వచ్చినట్లు కూడా ఆడియన్స్‌కు తెలియకుండా పోయింది.

టెక్నికల్‌గా పెదకాపు చాలా సౌండింగ్‌గా ఉంది.. అందులో ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. కానీ విలేజ్ డ్రామాను కూడా భారీ బడ్జెట్‌తో తెరకెక్కించి నిర్మాతను డేంజర్ జోన్‌లో పెట్టేసారు శ్రీకాంత్ అడ్డాల.

ఇదొక్కటనే కాదు.. కొన్నేళ్లుగా లైగర్, రాధే శ్యామ్ సహా చాలా సినిమాల విషయంలో దర్శకులకు క్లారిటీ మిస్ అయి.. నిర్మాతలు నిండా మునిగిపోయారు.