
ప్రజెంట్ టాలీవుడ్‌లో ఇద్దరు ముద్దుగుమ్మల మధ్య టఫ్ ఫైట్ జరుగుతోంది. కోవిడ్ టైమ్‌లో సడన్‌గా సూపర్ ఫామ్‌లోకి వచ్చిన ఓ బ్యూటీకి, ఇప్పుడు వరు సినిమాలతో బిజీగా ఉన్న మరో బ్యూటీ చెక్ పెడుతోంది. ఎవరా ముద్దుగుమ్మలు.. అసలు ఇద్దరి మధ్య జరుగుతున్న పోటి ఏంటి డిటైల్డ్‌గా చూద్దాం.

కోవిడ్ టైమ్‌లో ఉప్పెన సినిమాతో వెండితెర మీదకు దూసుకువచ్చిన అందాల భామ కృతిశెట్టి. తొలి సినిమాతోనే సెన్సేషనల్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ, ఆ తరువాత వరుస సినిమాలతో మరింత బిజీ అయ్యారు. మీడియం రేంజ్ హీరోల సినిమాలతో వరుస ఆఫర్స్ అందుకుంటూ మోస్ట్ వాంటెడ్‌గా మారారు.

శ్రీలీల జోరు మెయిన్‌గా ఎఫెక్ట్ చేస్తుంది కృతి శెట్టి కెరీర్‌నే అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. మరి శ్రీలీల ఇస్తున్న టఫ్ ఫైట్ నుంచి బయట పడేందుకు కృతి శెట్టి ఎలాంటి స్ట్రాటజీతో వస్తారో చూడాలి.

శ్రీలీల జెట్ స్పీడుతో దూసుకుపోతుండటం, కృతి శెట్టి కెరీర్‌కు స్పీడు బ్రేకర్‌లా మారిందంటున్నారు క్రిటిక్స్. ఓ వైపు బిగ్ బడ్జెట్ సినిమాలు చేస్తూనే మరో వైపు మీడియం రేంజ్ హీరోలతోనే స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు శ్రీలీల.

మరో సెన్సెషనల్ బ్యూటీ శ్రీలీల కూడా అదే స్పీడుగా వెండితెరను కబ్జా చేశారు. పెళ్లి సందడితో ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల షార్ట్ టైమ్‌లోనే స్టార్ లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చేశారు. మీడియం రేంజ్ హీరోలతో పాటు స్టార్ హీరోల సినిమాల్లోనూ ఆఫర్స్ అందుకుంటూ ఫుల్ బిజీ అవుతున్నారు.

శ్రీలీల వచ్చిన ఆఫర్ ఏదీ కాదనకుండా సినిమాలు ఓకే చేసుకుంటూ పోతున్నారు. దీంతో ఆ సెగ్మెంట్‌లో మరో హీరోయిన్స్‌కు ఆఫర్సే కరువవుతున్నాయి.