‘ఆశ క్యాన్సర్ ఉన్నవాడిని కూడా బ్రతికిస్తుంది.. భయం అల్సర్ ఉన్నవాడిని కూడా చంపేస్తుంది’.. క్యాన్సర్ మహమ్మారిని జయించిన తారలు వీరే..

|

Dec 20, 2021 | 5:39 PM

" ఆశ క్యాన్సర్ ఉన్నవాడిని కూడా బ్రతికిస్తుంది.. అల్సర్ భయం ఉన్న వాడిని కూడా చంపేస్తుంది"

1 / 7
క్యాన్సర్ .. ఈ మహమ్మారిని చిరునవ్వుతో ఎదుర్కొంటున్నారు మన సెలబ్రెటీలు.. అల్లు అర్జున్ నటించిన జులాయి సినిమాలో త్రివిక్రమ్ " ఆశ క్యాన్సర్ ఉన్నవాడిని కూడా బ్రతికిస్తుంది.. అల్సర్ భయం ఉన్న వాడిని కూడా చంపేస్తుంది" అని రాశారు. దాన్ని నిజం చేస్తున్నారు మన సినిమా తారలు. క్యాన్సర్ మహమ్మారిని ఎంతో దైర్యంగా ఎదుర్కొంటున్నారు. 

2 / 7
క్యాన్సర్ జయించిన వారిలో ముందుగా చెప్పాలంటే స్టార్ హీరోయిన్ మనీష కొయిరాలా గురించే చెప్పాలి. ఈ అందాల తార క్యాన్సర్ ను ఎంతో దైర్యంగా ఎదుర్కొంది. మనీషా కొయిరాలా 2012లో అండాశయ క్యాన్సర్ బారినపడ్డారు. మూడేళ్ల చికిత్స అనంతరం 2015లో ఆమె క్యాన్సర్‌ను జయించారు.

3 / 7
ప్రేమికుల రోజు సినిమాతో కుర్రకారు మనసు కొల్లగొట్టింది అందాల భామ సోనాలి బింద్రా.. ఆతర్వాత మహేష్ నటించిన మురారి సినిమాతో డైరెక్ట్ గా తెలుగు సినిమాలో నటించి ఆకట్టుకుంది ఈ బ్యూటీ. ఆతర్వాత తెలుగులో సూపర్ హిట్స్ సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. ఇక ఈ ముద్దుగుమ్మ కూడా క్యాన్సర్ ను జయించింది. సోనాలిబింద్రే మెటాస్టాటిక్ క్యాన్సర్‌ను జయించారు. 

4 / 7
అలాగే హీరోయిన్ గౌతమి కూడా క్యాన్సర్ ను జయించారు. గౌతమి బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధపడ్డారు. ఆతర్వాత ఆమె ఆ మహమ్మారిని జయించారు. ఆ సమయంలో ఆమె ఎంత దైర్యంగా ఉన్నారు అన్నది క్యాన్సర్ ఏవైరెన్స్ కార్యక్రమంలో చెప్పుకొచ్చారు గౌతమి. 

5 / 7
అందాల తార మమతా మోహన్ దాస్ కూడా క్యాన్సర్ మహమ్మారిని జయించారు. హాడ్కిన్ లింఫోమా బాధపడ్డారు మమతా. మమతా మల్టీటాలెంటెడ్ ఆమె సింగర్ గా హీరోయిన్ గా తన ప్రతిభను చాటుకున్నారు. 2009 లో క్యాన్సర్ బారిన పడిన మమతా ఎంతో దైర్యంగా ఆ వ్యాధి నుంచి బయటపడ్డారు. 

6 / 7
ఇక బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధపడ్డారు.. అలుపెరుగని పోరాటం తర్వాత సంజయ్ క్యాన్సర్ ను జయించారు. 61 ఏళ్ల వయసులోనూ ఆయన క్యాన్సర్‌తో పోరాడిన తీరు ప్రతిఒక్కరిలో స్ఫూర్తినింపింది. 

7 / 7
హంసానందిని.. తెలుగు చిత్రపరిశ్రమలో తన నటనతో ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరోయిన్. హంసానందినికి అందం, అభినయం కలగలిపి ఉన్నప్పటికీ హీరోయిన్‏గా అవకాశాలు మాత్రం అందుకోలేకపోయింది.