
దేశ వ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు సోమవారం (ఆగస్టు 26) ఘనంగా జరిగాయి. ఈ పర్వదినాన చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను బాల గోపాలుడిలా అందంగా ముస్తాబు చేసి మురిసిపోయారు. పలువురు సినీ సెలబ్రిటీలు కూడా తమ కుమారులు, కొడుకులను శ్రీకృష్ణుని గెటప్ లు వేసి ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఇక శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మిల్కీ బ్యూటీ తమన్నా తన సోషల్ మీడియా ఖాతాల్లో కొన్ని అందమైన ఫొటోలను షేర్ చేసింది.

ఇందులో కృష్ణుడి ప్రేయసి రాధారాణిగా ఎంతో అందంగా కనిపించింది తమన్నా భాటియా. ప్రస్తుతం ఈ ఫొటోలు అభిమానులు, నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్నాయి.

ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, కరణ్ టోరానీ లేటెస్ట్ కలెక్షన్ ‘లీలా: ది ఇల్యూషన్ ఆఫ్ లవ్’ లో మెరిసింది తమన్నా. ఇందులో భాగంగానే రాధగా ముస్తాబైంది తమన్నా.

ఇటీవలే శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు కలిసి నటించిన స్త్రీ 2 చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసింది తమన్నా. ఈ పాట కోసం భారీ రెమ్యునరేషన్ అందుకుందని సమాచారం.

ఇక ప్రస్తుతం పలు దక్షిణాది సినిమాలతో పాటు హిందీ సినిమాల్లోనూ నటిస్తోంది తమన్నా. అలాగే పలు వెబ్ సిరీసుల్లోనూ నటిస్తూ బిజీ బిజీగా ఉంటోంది.