
టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ రెజీనా కాసాండ్రాకు సామాజిక స్పృహ కాస్త ఎక్కువ. సినిమాలతో బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మ సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొంటుంది.

తాజాగా మన దేశ పార్లమెంట్ లోకి అడుగు పెట్టింది రెజీనా కాసాండ్రా. అయితే ఎంపీగా మాత్రం కాదండోయ్..

డెమో క్రటిక్ సంఘా పేరుతో నడుపుతున్న స్వచ్ఛంద సంస్థలో రెజీనా కూడా పనిచేస్తోంది. ఈ సంస్థలోని తొలి బ్యాచ్ విద్యార్థులని తీసుకుని రెజీనా.. పార్లమెంట్ సందర్శనకు వెళ్లింది.

ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భారత పార్లమెంట్ పరిసరాల్లో కలియ తిరిగింది రెజీనా. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి.

పార్లమెంట్ అంతర్గత పనితీరు వీక్షించడంతో పాటు ప్రజాస్వామ్య పాలన, శాసన ప్రక్రియల గురించి రెజీనా తెలుసుకుంది.