
టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ మెహ్రీన్ కౌర్ పిర్జాడా తిరుమల శ్రీవారి సేవలో పాల్గొంది. శనివారం (మార్చి 01) ఆమె ఏడుకొండల స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంది

మెహ్రీన్ తో పాటు టాలీవుడ్ యంగ్ హీరో, మజాకా ఫేమ్ సందీప్ కిషన్ కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు.

కాగా మెహ్రీన్ తెలుగు సినిమాల్లో కనిపించి చాలా రోజులవుతోంది. ఆమె చివరిగా 2002లో రిలీజైన ఎఫ్ 3: ఫన్ అండ్ ఫ్రస్టేషన్ సినిమాలో నటించింది.

ఆ తర్వాత స్పార్క్ అనే ఓ చిన్న సినిమాలోనూ యాక్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో ఒక కన్నడ సినిమా మాత్రమే ఉంది.

కాగా మెహ్రీన్ హరియాణాకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు భవ్య బిష్ణోయ్‌తో నిశ్చితార్థం చేసుకుంది. అయితే నాలుగు నెలల తర్వాత తన ఎంగేజ్ మెంట్ ను రద్దు చేసుకుందీ అందాల తార.

ఆ మధ్యన ఓ బాలీవుడ్ వెబ్ సిరీస్ లో బోల్డ్ గా నటించి వార్తల్లో నిలిచింది మెహ్రీన్. ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రమే ఎక్కువగా కనిపిస్తోందీ అందాల తార.