Rajeev Rayala |
Updated on: Nov 09, 2024 | 2:08 PM
చాలా మంది హీరోయిన్స్ అందం, అభినయం ఉన్నా కూడా అవకాశాలు మాత్రం అందుకోలేకపోతున్నారు. అలాంటి వారిలో ఈషా రెబ్బ ఒకరు. పలు సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేసుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ భామ.
అంతకు ముందు.. ఆ తరువాత.. సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ అమ్మడు. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది ఈ అమ్మడు. తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ అమ్మడు.
ఇక ఈ చిన్నది వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. హీరోయిన్ గా బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు అందుకున్న ఈ అమ్మడు అనుకున్నంత స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయింది.
ఇక ఈ చిన్నది హీరోయిన్ గానే కాదు సెకండ్ హీరోయిన్ గాను సినిమాలు చేసింది. అరవింద సమేత వీర రాఘవ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ బ్యూటీ. కానీ ఈ భామకు అవకాశాలు మాత్రం రాలేదు.
చివరిగా ఈ చిన్నది మామా మశ్చీంద్ర సినిమాలో నటించింది. కానీ ఆ సినిమా కూడా నిరాశపరిచింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది. రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.