
ఇస్మార్ట్ శంకర్ టెంప్లేట్‌లోనే ఉంది అనేది. రామ్ హీరోగా నటించిన ఇస్మార్ట్ శంకర్‌కి సీక్వెల్‌గా డబుల్ ఇస్మార్ట్ ని తెరకెక్కిస్తున్నారు పూరి జగన్నాథ్. డబుల్ ఇస్మార్ట్ టీజర్‌లో థీమ్, డైలాగులు, బ్యాక్‌డ్రాప్, ఈశ్వరుడి ప్రస్తావన... ఇలా ప్రతిదీ ఫస్ట్ పార్టుని గుర్తుచేస్తోంది.

మహాశివరాత్రి, మహిళా దినోత్సవం... ఒకటికి రెండు అకేషన్లు కలిసి వస్తాయని మార్చి 8న రిలీజ్ చేయాలనుకున్నారు డబుల్ ఇస్మార్ట్ ని. అయితే స్కంధ ఫ్లాప్ తర్వాత ఆచితూచి తీర్చిదిద్దుతున్నారు ఈ ప్రాజెక్టుని. అందుకే విడుదలలోనూ జాప్యం కనిపిస్తోంది. సో ఈ గ్యాప్‌ని క్యాష్ చేసుకోవడానికి రెడీ అయిపోయారు మిస్టర్ గోపీచంద్.

ఎన్నాళ్లుగానో హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు గోపీచంద్. ఆరడుగుల హీరో, పర్ఫెక్ట్ డైలాగ్ డెలివరీ ఉంటుంది. యాక్షన్‌కి కేరాఫ్ అంటూ టాలీవుడ్‌లో స్పెషల్ ప్లేస్‌ని క్రియేట్ చేసుకున్నారు గోపీచంద్. అయితే గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక సతమతమవుతున్నారు. ఈ వారంలో విడుదలయ్యే భీమాతో ఆ సక్సెస్ రావాలని ఆకాంక్షిస్తున్నారుగోపీచంద్.

భీమా మాత్రమే కాదు, గామి కూడా ఇదే వారమే విడుదలకు రెడీ అవుతోంది. ఇలాంటి స్క్రిప్టుల్ని ఇప్పుడైతే ఒప్పుకోనంటున్నారు విశ్వక్సేన్. ఐదేళ్ల క్రితం ప్యాషన్‌తో ఓకే చెప్పిన ప్రాజెక్ట్ గామి. ఇంటర్నేషనల్ సినిమాను చూసిన ఫీలింగ్ క్రియేట్ చేస్తుంది. మంచి థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ అవుతుంది అంటూ గామి మీద ఎక్స్ పెక్టేషన్స్ పెంచుతున్నారు విశ్వక్సేన్.

ఒక్క హిట్ కావాలి అని గోపీచంద్, విశ్వక్సేన్ గ్రౌండ్‌లో దిగి మరీ తమ సినిమాలను ప్రమోట్ చేస్తున్నారు. అయితే, ఆల్రెడీ మాకున్న పబ్లిసిటీతోనే ఫుల్ మార్కులు పడతాయనే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది ప్రేమలు టీమ్‌లో. మలయాళంలో సూపర్‌డూపర్ హిట్ అయిన క్లీన్ లవ్‌స్టోరీ కోసం తెలుగు ప్రేక్షకులు కూడా ఇష్టంగా వెయిట్ చేస్తున్నారు. ఇలా, ఒకటికి, మూడు సినిమాలతో ఈ వారం బాక్సాఫీస్ వార్ ఇంట్రస్టింగ్‌గా మారింది.