ఈక్రమంలోనే మహేష్ బాబుకు సంబంధించిన ఏ చిన్న విషయమైనా సరే ఈ మధ్య నెట్టంట్లో తెగ వైరల్ అవుతోంది. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది అది ఏమిటంటే?
మహేష్ బాబు, నాని కలిసి నటించిన సినిమాలు లేవు. అంతే కాకుండా వీరి కాంబోలో మూవీ వస్తే బాగుంటుందని చాలా మంది అనుకున్నారు. కానీ ఇప్పటి వరకు అది జరగలేదు.
అయితే గతంలోనే వీరి కాంబోలో ఓ క్రేజీ మూవీ వచ్చేదంట. ఇంతకీ ఆ సినిమా ఏమిటంటే? మహేష్ బాబు బ్లాక్ బస్టర్ సినిమాల్లో మహర్షి మూవీ ఒకటి. ఈ మూవీలో అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించగా, పూజా హెగ్దే హీరోయిన్‌గా సూపర్ స్టార్ సరసన ఆడిపాడింది.
వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లరి నరేష్ పాత్ర చాలా మందికి కనెక్ట్ అయ్యింది. అయితే దర్శకుడు ఈ పాత్ర కోసం ముందుగా నేచురల్ స్టార్ నానిని సంప్రదించగా, ఆయన అది గెస్ట్ పాత్ర కావడంతో నో చెప్పాడంట.
అంతే కాకుండా మహేష్ బాబు లాంటి స్టార్ సినిమాల్లో గెస్ట్ పాత్ర చేస్తే బాగోదనే ఉద్దేశంతో ఆయన ఆ మూవీని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. అలా మహేష్ బాబు, నాని కాంబోలో మూవీ మిస్ అయ్యిందంట.