Taapsee Pannu: పెళ్లి వార్తలపై తాప్పి రియాక్షన్.. ఏమన్నారో తెలుసా!

| Edited By: Shaik Madar Saheb

Feb 28, 2024 | 5:50 PM

ఈ ఏడాది మార్చిలో తన చిరకాల బాయ్ ఫ్రెండ్ మథియాస్ బోను పెళ్లి చేసుకోబోతున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించేందుకు తాప్సీ నిరాకరించింది. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎలాంటి సమాచారం పంచుకోలేదని, ఎప్పటికీ చేయబోనని బుధవారం ఖండించింది.

1 / 5
ఈ ఏడాది మార్చిలో తన చిరకాల బాయ్ ఫ్రెండ్ మథియాస్ బోను పెళ్లి చేసుకోబోతున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించేందుకు తాప్సీ నిరాకరించింది. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎలాంటి సమాచారం పంచుకోలేదని, ఎప్పటికీ చేయబోనని బుధవారం ఖండించింది. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి తానెప్పుడూ ఎలాంటి వివరణ ఇవ్వలేదని, ఎప్పటికీ చేయనని అన్నారు.

2 / 5
2023 మార్చిలో తాప్సీ తన చిరకాల బాయ్ఫ్రెండ్ మథియాస్ బోను వివాహం చేసుకోబోతోందని వార్తలొచ్చాయి. సిక్కు-క్రిస్టియన్ తరహాలో నటి వివాహం చేసుకోనున్నట్లు రూమర్స్ వినిపించాయి. బాలీవుడ్ సెలబ్రిటీలు ఎవరూ హాజరుకాకుండా ఈ వివాహ వేడుక ప్రైవేట్ వ్యవహారంగా ఉంటుందని తెలిపాయి.తాప్సీ దాదాపు పదేళ్లుగా భారత బ్యాడ్మింటన్ జట్టు కోచ్ తో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలొచ్చాయి.

3 / 5
2013లో వచ్చిన చష్మే బద్దూర్ అనే తన తొలి సినిమా చేస్తున్న సమయంలోనే మథియాస్ ను కలిశానని రాజ్ షమానీకి చెప్పడంతో తన రిలేషన్ షిప్ గురించి చెప్పుకొచ్చింది. అప్పటి నుంచి తాను ఒకే వ్యక్తితో ఉన్నానని, అతడిని విడిచిపెట్టే ఆలోచన గానీ, మరొకరితో గానీ తనకు ఎలాంటి ఆలోచనలు లేవని, రిలేషన్ షిప్ లో తాను చాలా హ్యాపీగా ఉన్నానని తెలిపింది.

4 / 5
ఇదిలా ఉంటే తాప్సీ ఇటీవల రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కించిన డంకీ సినిమాలో నటించింది. షారుఖ్ ఖాన్ నటించిన ఈ చిత్రం 2023 డిసెంబర్లో విడుదలైంది. ప్రపంచ బాక్సాఫీస్ వద్ద రూ.450 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన డంకీ సినిమా అందరికీ బాగా నచ్చింది. ఆ తర్వాత తాప్సీ 'వో లడ్కీ హై కహాన్' అనే కామెడీ డ్రామా చిత్రంలో నటిస్తోంది. ప్రతీక్ బబ్బర్, ప్రతీక్ గాంధీ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి అర్షద్ సయ్యద్ దర్శకత్వం వహించారు.

5 / 5
ఇక హసీన్ దిల్రుబా సీక్వెల్ తెరకెక్కుతోంది. ఫిర్ ఆయీ హసీన్ దిల్రుబాలో తాప్సీ విక్రాంత్ మాస్సే, సన్నీ కౌశల్, జిమ్మీ షెర్గిల్ లతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనుంది. అయితే దీని విడుదల తేదీ ఇంకా తెలియరాలేదు. బాలీవుడ్ లో విభిన్నమైన సినిమాలతో తనకంటూ పేరు తెచ్చుకుంది తాప్సి.