
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజై అవుతుందంటే సినిమా థియేటర్ల వద్ద తన అభిమానులు చేసే సందడి మాములుగా ఉండదు. ఇక ఈ హీరో చేసిన సినిమాల్లో చాలా వరకు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి. కానీ 2008 లో రిలీజైన జల్సా మూవీ మాత్రం మొదటి రోజు ప్లాప్ టాక్ తెచ్చుకొని తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందంట.

కొరటాల శివ దర్శకత్వంలో వచ్చి న జనతా గ్యారేజ్ మూవీ కూడా మొదటి నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ చివరలో సూపర్ హిట్ అందుకుంది. ఈ మూవీ 2016 లో రిలీజైన విషయం తెలిసిందే.

నాగార్జున, నాగచైతన్య కాంబోలో వచ్చిన బంగార్రాజు మూవీ రిలీజైన మొదటి రోజు ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. కానీ తర్వాత వరసగా కలెక్షన్ల వర్షం కురిపిస్తూ సూపర్ హిట్ అందుకుంది.

అనిల్ రావుపూడి దర్శకత్వంలో మహేష్ బాబు, రష్మిక హీరోయి హీరోయిన్లుగా చేసిన మూవీ సరిలేరు నీకెవ్వరు. ఈ మూవీ రిలీజై ప్లాప్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, తర్వాత బ్లాక్ బస్టర్ అందుకుంది.

అదే విధంగా అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ పుష్ప సినిమా కూడా రిలీజైన ఫస్ట్ డే ప్లాప్ టాక్ తెచ్చుకుంది. కానీ బాక్సాపీస్ వద్ద అత్యధిక వసూల్లు రాబట్టి, పాన్ ఇండియా లెవల్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇదే కాకుండా సరైనోడు కూడా నెగిటివ్ టాక్ సొంతం చేసుకొని సూపర్ హిట్ అందుకుంది.