
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన సినిమాల్లో ఏటో వెళ్లిపోయింది మనసు సినిమా ఒకటి. ఈమూవీలో నాని, సమంత జంటగా నటించిన ఈ మూవీ సూపర్ హిట్ అందుకుంది. కాగా, ఈ మూవీ కథను మొదట రామ్ చరణ్ కు చెప్పగా ఆయన ఆరెంజ్ మూవీ ఎఫెక్ట్ తో ఈ సినిమాకు నో చెప్పారంట. అలా నానికి ఛాన్స్ వచ్చింది.

నాగచైతన్య చేసిన సినిమాల్లో జోష్ మూవీ ఒకటి. అయితే ఈ సినిమాను మొదట రామ్ చరణ్ చేయాల్సి ఉండేదంట. కానీ మగధీర లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఈ సినిమా చేయడం కరెక్ట్ కాదని బావించి ఈ మూవీని రిజెక్ట్ చేశాడంట.

ఒకే బంగారం మూవీ రిలీజై సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాను కూడా రామ్ చరణ్ రిజక్ట్ చేశారంట.

అదే విధంగా, గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన సూర్య సన్నాఫ్ కృష్ణన్ మూవీ కూడా గౌతమ్ మీనన్ మొదట చెర్రీతో చేయాలనుకుందంట. కానీ చరణ్ కు డేట్స్ కుదరకపోవడంతో రిజక్ట్ చేయాల్సి వచ్చింది.

బారీ డిజాస్టర్ సినిమాల్లో అఖిల్ ఏజెంట్ మూవీ ఒకటి. అయితే మొదట ఈ సినిమాను రామ్ చరణ్ తో తీయాలనుకున్నారంట దర్శకుడు. కానీ కథ నచ్చకపోవడంతో చెర్రీ దీనిని రిజక్ట్ చేశారు. దీంతో అఖిల్ ఈ సినిమాను చేశారు. ఇక ఈ మూవీ ఎంత పెద్ద డిజాస్టర్ అయ్యిందో అందరికీ తెలుసు. అలా రామ్ చరణ్ బారీ డిజాస్టర్ నుంచి బయటపడ్డారంటున్నారు తన అభిమానులు.