2021 Top Movies: ఈ ఏడాది బాక్సాఫీస్‌ ముందు దుమ్మురేపిన సినిమాలివే.. రూ. వంద కోట్ల మార్క్‌ దాటేసి మరీ..

|

Dec 23, 2021 | 4:58 PM

2021 Top Movies: కరోనా కారణంగా 2021లో సినిమా ఇండస్ట్రీ కుంటుపడింది. అయితే ఇలాంటి విప్కతర పరిస్థితులను సైతం తట్టుకొని కొన్ని సినిమాలు జయకేతనాన్ని ఎగరవేశాయి. రూ. 100 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టి టాలీవుడ్‌ సత్తా చాటాయి..

1 / 5
 గతేడాది టాలీవుడ్‌కు గడ్డు కాలమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కరోనా ప్రభావంతో ప్రేక్షకులకు థియేటర్లవైపు చూడడానికి వెనకా ముందయ్యారు. అయితే ఇలాంటి పరిస్థితులను సైతం తట్టుకొని కొన్ని సినిమాలు బాక్సాఫీస్‌ ముందు సందడి చేశాయి. రికార్డు కలెక్షన్లతో దుమ్మురేపాయి. ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలపై ఓ లుక్కేయండి.

2 / 5
ఈ ఏడాది రూ. వంద కోట్ల మార్క్‌ను దాటిని తొలి చిత్రంగా 'ఉప్పెన' నిలిచింది. చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రం రికార్డులను బద్దలు కొట్టింది. తొలి సినిమాతోనే వైష్ణవ్‌ తేజ్‌ అద్భుత విజయాన్ని అందుకున్నాడు. బుచ్చిబాబు మార్క్‌ దర్శకత్వం, కృతిశెట్టి క్యూట్‌ లుక్స్‌, దేవీశ్రీ సంగీతం వెరసి ఈ సినిమా విజయాన్ని సాధించింది. ఈ సినిమా ఏకంగా రూ. 100 కోట్ల (గ్రాస్‌) సాధించింది.

3 / 5
2021లో రూ. 100 కోట్ల వసూళ్లను దాటేసిన మరో చిత్రంగా 'వకీల్‌సాబ్‌' నిలిచింది. ఏప్రిల్‌ 9న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టింది. హిందీలో వచ్చిన 'పింక్‌'కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ. 130 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. ఈ సినిమాలో పవన్‌ లాయర్‌ పాత్రలో అద్భుత నటనను కనబరిచి తన స్టామినా ఏమాత్రం తగ్గలేదని నిరూపించారు.

4 / 5
2021 టాలీవుడ్‌కు అందించిన మరో అద్భుమైన బహుమతి అఖండ మూవీ. బాలకృష్ణ నట విశ్వరూపం, బోయపాటి శ్రీను దర్శకత్వం వెరసి అఖండను బాక్సాఫీస్‌ ముందు హిట్‌గా నిలిపింది. ఈ సినిమా ఏకంగా రూ. 115 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్‌ చేసి ఇంకా వసూళ్లను కొనసాగిస్తూనే ఉంది.

5 / 5
అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'పుష్ప' పాన్‌ ఇండియా చిత్రాలకు ఊతమిచ్చింది. ఈ సినిమా విడుదలైన ప్రతీచోట మంచి టాక్‌ సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది. కేవలం ఆరు రోజుల్లోనే పుష్ప ఏకంగా రూ. 150 కోట్ల గ్రాస్‌ వసూలు చేసి రూ. 200 కోట్ల క్లబ్‌లో చేరడానికి దూసుకుపోతోంది. ఈ సినిమా బాలీవుడ్‌లోనూ మంచి విజయం సాధించడం మరో విశేషం.