
తాజాగా గోట్ సైతం 300 కోట్లు దాటి.. 400 కోట్ల వైపు పరుగులు తీస్తుంది. టాక్‌తో పనిలేదు.. ప్రభాస్, విజయ్ నుంచి సినిమాలు వస్తే చాలు రికార్డులు కుదేలవుతున్నాయి.

వర్షాలు, వరదల్లోనూ గతవారం విడుదలైన నాని సరిపోదా శనివారం మంచి వసూళ్లనే తీసుకొస్తుంది. దీనికి వచ్చిన రెస్పాన్స్ చూసిన తర్వాత నిర్మాతలలో ధైర్యం పెరిగింది. అందుకే ఈ వారం సినిమాలు బాగానే వస్తున్నాయి.

వినాయక చవితి వీకెండ్ క్యాష్ చేసుకోడానికి వచ్చేస్తున్న సినిమాల్లో ది గోట్ ముందుంది. విజయ్ హీరోగా నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 5న విడుదలవుతుంది. పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వెళ్లే ముందు విజయ్ చేసిన చివరి సినిమాల్లో గోట్ కూడా ఒకటి.

వరసగా వందల కోట్లు వసూలు చేస్తూ.. రికార్డుల వీరులుగా మారిపోతున్నారు వాళ్లు. మరి ఆ స్థాయిలో బాక్సాఫీస్‌ను దున్నేస్తున్న హీరోలెవరు.? అడుగేస్తే రికార్డులు.. సినిమా వస్తే కలెక్షన్ల సంచలనాలు..

నందకిషోర్ తెరకెక్కించిన 35.. చిన్న కథ కాదు కూడా ఈ వారమే వస్తుంది. ఇందులో నివేదా థామస్, విశ్వదేవ్ జంటగా నటించారు. తారే జమీన్ పర్ తెలుగు వర్షన్‌లా ఉండబోతుందీ సినిమా. ప్రీమియర్స్‌కు మంచి రెస్పాన్స్ రావడం 35కి కలిసొచ్చే విషయం. ఇవి కాక.. ఉరుకు పటేలా సినిమా ఇదే వారం వస్తుంది. సుహాస్ జనక అయితే గనక వర్షాల కారణంగా సెప్టెంబర్ 7 నుంచి వాయిదా పడింది.