ఏళ్ళ తరబడి ఫ్లాపులు.. ఉన్న ఇమేజ్‌ను డ్యామేజ్ చేసుకుంటున్న హీరోలు వీళ్ళే

| Edited By: Phani CH

Sep 04, 2024 | 8:30 PM

అస్తిత్వమే ప్రమాదంలో పడినపుడు ఎంత ఇమేజ్ ఉండి మాత్రం ఏం లాభం..? ఎంత మార్కెట్ ఉండి మాత్రం ఏం చేస్తాం..? ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు అనేగా మీ అనుమానం. లేట్ ఎందుకు చెప్తాం కదా..! తెలుగు ఇండస్ట్రీలో కొందరు హీరోలను చూస్తుంటే ఇదే అనిపిస్తుందిప్పుడు. ఏళ్ళ తరబడి ఫ్లాపులిస్తూ.. ఉన్న ఇమేజ్‌ను డ్యామేజ్ చేసుకుంటున్నారు వాళ్లు. రవితేజ ఉరఫ్ మాస్ రాజా.. ఒకప్పుడు మినిమమ్ గ్యారెంటీ హీరో.. కానీ ఇప్పుడు మాత్రం కాదు.

1 / 5
అస్తిత్వమే ప్రమాదంలో పడినపుడు ఎంత ఇమేజ్ ఉండి మాత్రం ఏం లాభం..? ఎంత మార్కెట్ ఉండి మాత్రం ఏం చేస్తాం..? ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు అనేగా మీ అనుమానం. లేట్ ఎందుకు చెప్తాం కదా..! తెలుగు ఇండస్ట్రీలో కొందరు హీరోలను చూస్తుంటే ఇదే అనిపిస్తుందిప్పుడు. ఏళ్ళ తరబడి ఫ్లాపులిస్తూ.. ఉన్న ఇమేజ్‌ను డ్యామేజ్ చేసుకుంటున్నారు వాళ్లు.

2 / 5
రవితేజ ఉరఫ్ మాస్ రాజా.. ఒకప్పుడు మినిమమ్ గ్యారెంటీ హీరో.. కానీ ఇప్పుడు మాత్రం కాదు. కాస్త కఠువుగా చెప్పాలంటే రవితేజ చేస్తున్న సినిమాలు ఆయన ఫ్యాన్స్‌కు కూడా నచ్చట్లేదు. అందుకే కనీసం 10 కోట్ల షేర్ కూడా దాటలేకపోతున్నాయి ఈయన సినిమాలు. మొన్నొచ్చిన మిస్టర్ బచ్చన్.. దానికి ముందొచ్చిన ఈగల్, టైగర్ నాగేశ్వరరావు, రావణాసుర అన్నీ ఫ్లాపులే.

3 / 5
రెమ్యునరేషన్, కాంబినేషన్స్‌పై చూపించిన శ్రద్ధ కథపై చూపించట్లేదని రవితేజపై చాలా పెద్ద విమర్శలే వస్తున్నాయిప్పుడు. మిస్టర్ బచ్చన్ చూస్తే అది నిజమే అనిపించక మానదు. హరీష్ శంకర్ సైతం మాస్ రాజాను బ్యాడ్ లక్ నుంచి బయటకి తేలేకపోయారు. ప్రస్తుతం రవితేజ సినిమాల ప్రభావం.. ఆయన ప్రాభవం రెండూ ప్రమాదంలో పడిపోయాయి.

4 / 5
గోపీచంద్ కూడా అంతే. ఒకప్పుడు వరస విజయాలు అందుకున్న ఈ హీరో.. పదేళ్ళుగా ఒక్క సక్సెస్ అంటూ వేచి చూస్తున్నారు. 2014లో వచ్చిన లౌక్యం తర్వాత గోపీకి సక్సెస్ లేదు. తలాతోక లేని సినిమాలు చేస్తున్నారంటూ ఈయనపై విమర్శలు బాగానే ఉన్నాయి. ప్రస్తుతం శ్రీను వైట్లతో చేస్తున్న విశ్వంపైనే గోపీచంద్ ఆశలున్నాయి. అక్టోబర్ 11న విడుదల కానుంది ఈ చిత్రం

5 / 5
శర్వానంద్ కెరీర్ సైతం డైలమాలోనే ఉంది. ఒకప్పుడు 30 కోట్ల మార్కెట్ ఉన్న శర్వా సినిమాలు ఇప్పుడు 10 కోట్లు వసూలు చేయలేకపోతున్నాయి. రామ్ పోతినేని, నాగ చైతన్య, విజయ్ దేవరకొండకు కూడా ఫ్లాప్స్ ఉన్నా.. ఈ హీరోల అస్తిత్వానికి వచ్చిన సమస్యేమీ లేదు. కానీ రవితేజ, గోపీచంద్, శర్వా మాత్రం వీలైనంత త్వరగా మేల్కోకపోతే ఊహించని డ్యామేజ్ తప్పదేమో..!