విజయ్ మొదటి సారి శివ తో కలిసి పని చేస్తున్నారు. ఈ సినిమాను అందమైన ప్రేమ కథగా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ మూవీ కోసం ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ న్యూస్ వచ్చింది. త్వరలోనే ఖుషి మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.