
చూస్తుండగానే జనవరి అయిపోయింది.. సంక్రాంతి సినిమాల్లో హనుమాన్ సెన్సేషన్ క్రియేట్ చేస్తే.. గుంటూరు కారం, నా సామిరంగా కూడా మంచి వసూళ్లనే తీసుకొచ్చాయి. ఆ తర్వాత వచ్చిన సినిమాలేవీ పెద్దగా ఆడలేదు.

దాంతో అందరి చూపు ఫిబ్రవరిపై పడింది. గత ఫిబ్రవరిలో రైటర్ పద్మభూషణ్‌తో వచ్చిన సుహాస్.. ఈ సారి అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ సినిమాతో ఫిబ్రవరి 2న వచ్చాడు. దినికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించింది.

Yatra 2 movie twitter review

ఆ మరుసటి రోజే ఈగల్ విడుదల కానుంది. బడ్జెట్ పరంగా ఫిబ్రవరిలో రానున్న పెద్ద సినిమా ఇదే. రవితేజ ఇందులో హీరోగా నటిస్తున్నారు. ధమాకా తర్వాత సోలో హిట్ లేని రవితేజకు ఈగల్ విజయం కీలకంగా మారింది. దీనికోసమ నిర్మాతల మండలి మిగిలిన నిర్మాతలతో మాట్లాడి మరీ సోలో డేట్ ఇప్పించారు.

ఫిబ్రవరి 16న సందీప్ కిషన్ ఊరి పేరు భైరవకోన, సుందరం మాస్టార్ లాంటి సినిమాలు వస్తుంటే.. చివరి వారంలో వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలంటైన్ రానుంది. మొత్తానికి ఈ ఫిబ్రవరి అంతా సాలిడ్ కంటెంట్‌తో హౌజ్ ఫుల్ అయిపోయింది.