
ఇండస్ట్రీలోకి కొత్త హీరోయిన్ వచ్చేసింది. ఆమె నటించిన సినిమా విడుదల కాకుండానే సోషల్ మీడియాలో తెగ సెన్సేషన్ అవుతుంది. ఇప్పుడు ఈ అందానికి సంబంధించిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ పేరు తృప్తి రవీంద్ర. కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని నటించి నిర్మించిన శక్తి తిరుమగన్ (భద్రకాళి )సినిమాతో కథానాయికగా పరిచయం కాబోతుంది. ఈ సినిమా సెప్టెంబర్ 19న విడుదల కానుంది.

మహారాష్ట్రలోని ధూలే నగరానికి చెందిన ఈ బ్యూటీ ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఆ తర్వాత నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మొదట్లో స్టేజ్ ఆర్టిస్టుగా చేసింది. ఐదేళ్లపాటు నాటకాల్లో కనిపించిన ఆమె.. ఇప్పుడిప్పుడే వాణిజ్య ప్రకటనలలో కనిపించింది.

డ్యాన్స్, యోగ వంటి వాటిలోనూ ప్రావీణ్యం ఉంది. ఈ చిరంలో నటిస్తున్న సమయంలో తృప్తి తమిళ భాషను నేర్చుకోవడం విశేషం. విజయ్ ఆంటోని కథానాయకుడిగా నటించి నిర్మించారు.

థియేటర్ నాటకాల ద్వారా నటనలో శిక్షణ పొందినట్లు చెప్పింది. దర్శకుడు అరుణ్ ప్రభు, విజయ్ ఆంటోనితో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని పేర్కొంది.