Basha Shek |
May 03, 2023 | 9:48 PM
ప్రముఖ నటుడు, దర్శకుడు మనోబాల బుధవారం ఉదయం కన్నుమూశారు. ఆయన మరణవార్త విని ఆయన సినీ ప్రముఖులు, అభిమానులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు.
తమిళ చిత్ర పరిశ్రమలో మనోబాల బాగా పాపులర్. కామెడీ పాత్రల ద్వారా అందరినీ నవ్వించాడు. అయితే ఇప్పుడు ఆయన మరణ వార్త విని బంధువులంతా కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
దాదాపు కోలీవుడ్ స్టార్ హీరోలందరితోనూ మనోబాల నటించారు. ఈ క్రమంలో ఆయన మరణానంతరం పాత ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
సినీ పరిశ్రమలో మనోబాలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. 35 ఏళ్ల కెరీర్‌లో సుమారు 450కి పైగా సినిమాల్లో నటించారు. తెలుగులోనూ పలువురు స్టార్ హీరోల సినిమాల్లో నటించాడు.
మనోబాల నటనతో పాటు దర్శకత్వంలోనూ ప్రతిభను చాటుకున్నారు. 25కు పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. సీరియళ్లలోనూ నటిస్తూ బుల్లితెర అభిమానులను అలరించాడు.