- Telugu News Photo Gallery Cinema photos Tamannaah join superstar rajinikanth nelson dilipkumar movie
Tamannaah: బంపర్ ఆఫర్ కొట్టేసిన మిల్కీ బ్యూటీ.. ఏకంగా ఆ స్టార్ హీరో సరసన ఛాన్స్
దక్షిణాది చిత్రపరిశ్రమలో తమన్నా స్థానం ప్రత్యేకం. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ఇప్పటికీ యువతరం కథానాయికలుగా గట్టి పోటీనిస్తుంది మిల్కీబ్యూటీ
Updated on: Aug 13, 2022 | 10:05 PM

దక్షిణాది చిత్రపరిశ్రమలో తమన్నా స్థానం ప్రత్యేకం. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ఇప్పటికీ యువతరం కథానాయికలుగా గట్టి పోటీనిస్తుంది మిల్కీబ్యూటీ

ఇటీవలే ఎఫ్ 3 సినిమాతో ఆడియన్స్ను పలకరించిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న భోళా శంకర్ సినిమాలో నటిస్తోంది.

ఇప్పుడు ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తాజాగా ఈ అమ్మడు మరో బంపర్ ఆఫర్ కొట్టేసినట్లుగా తెలుస్తోంది.

డైరెక్టర్ నెల్సన్ కుమార్, సూపర్ స్టార్ రజినీ కాంత్ కాంబోలో రాబోతున్న జైలర్ చిత్రంపై ఇప్పటికే అంచనాలు భారీగా నెలకొన్నాయి. రోజు రోజుకీ ఈ సినిమాలో నటించే తారాగణం సంఖ్య పెరిగిపోతుంది. ఇందులో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కీలకపాత్రలో నటించనుండగా.. ఇప్పుడు తమన్నా కూడా కనిపించనుందని టాక్ వినిపిస్తుంది.

ఇందుకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం జైలర్ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతుంది.

త్వరలోనే ఈ మూవీ షూటింగ్లో తమన్నా జాయిన్ కానుందని తెలుస్తోంది.




